Radhe Shyam OTT Release : ఓటీటీలోకి పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published : Mar 28, 2022, 03:17 PM ISTUpdated : Mar 28, 2022, 03:20 PM IST
Radhe Shyam OTT Release : ఓటీటీలోకి పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సారాంశం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్దే జంటగా నటించిన తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ Radhe Shyam. ఈ భారీ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ పై ప్రైమ్ వీడియో అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

భారీ బడ్జెట్ తో రూపొందించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘రాధే శ్యామ్’  మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) జంటగా నటించారు.  భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది. కానీ.. రూ.350 కోట్లతో నిర్మించిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో కొంత వెనకబడిదనే చెప్పాలి. ఇప్పటి వరకు బాక్సాఫీస్ అందించిన రిపోర్ట్ ప్రకారం రూ.214  కోట్ల గ్రాస్ ను  మాత్రమే రాధే శ్యామ్ దక్కించుందని తెలుస్తోంది.         

కానీ, ప్రభాస్ అభిమానులు  మాత్రం ‘రాధే శ్యామ్’ను ఆదరిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రేక్షకులు రాధే శ్యామ్ ఓటీటీ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ  అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా (Amazon Prime Video In) ప్రభాస్ బ్లాక్ బస్టర్ ‘రాధే శ్యామ్’ డిజిటల్ గ్లోబల్ ప్రీమియర్‌ను ప్రకటించింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు రాధే శ్యామ్ అందుబాటులోకి రానుంది.  ఏప్రిల్ 1 నుండి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రాధే శ్యామ్ డిజిటల్ ప్రీమియర్‌ను  ప్రసారం చేయనున్నారు. 

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, గోపి కృష్ణ మూవీస్ సమర్పణలో UV క్రియేషన్స్ నిర్మించింది. ఈ రొమాన్స్ డ్రామాలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన  పాత్రలో నటించారు. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రి, సత్యన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా