పవన్‌ స్పీడ్‌కి ఫ్యాన్స్ బేజార్‌.. మరో రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ?

By Aithagoni Raju  |  First Published Apr 22, 2021, 3:44 PM IST

పవన్‌ మరింత స్పీడ్‌ పెంచారు. కొత్త సినిమాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారట. ఆయన మరో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 


పవన్‌ కల్యాణ్‌ ఇటీవల `వకీల్‌సాబ్‌`తో బంపర్‌ హిట్‌ అందుకుని గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ చిత్రం `హరిహర వీరమల్లు` రూపొందుతుండగా, మలయాళ సూపర్‌ హిట్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో పట్టాలెక్కుతుంది. దీన్ని త్రివిక్రమ్‌ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. అలాగే సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. 

 ఇవే కాకుండా పవన్‌ మరింత స్పీడ్‌ పెంచారు. కొత్త సినిమాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారట. ఆయన మరో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతుంది. `వకీల్‌సాబ్‌` నిర్మాత దిల్‌రాజుతో మరో సినిమా చేసేందుకు పవన్‌ ఓకే చెప్పినట్టు సమాచారం. `వకీల్‌సాబ్‌` సక్సెస్‌ తర్వాత పవన్‌ని దిల్‌రాజు కలిసి ధన్యవాదాలు తెలిపారని, దీంతోపాటు ఆయనతో మున్ముందు కూడా జర్నీ చేయాలని, మరో సినిమా చేసేందుకు తక్షణమే సిద్ధంగా ఉన్నట్టు చెప్పారట. దీంతో దిల్‌రాజు రిక్వెస్ట్ ని పవన్‌ ఓకే చెప్పాడని, ఓ సినిమాకి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి దీనికి దర్శకుడెవరనేది సస్పెన్స్.

Latest Videos

అయితే ప్రస్తుతం దిల్‌రాజు.. ప్రస్తుతం శంకర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఇందులో కీలక పాత్ర కోసం నాలుగు భాషల్లో నలుగురు సూపర్‌ స్టార్లని తీసుకోబోతున్నారని, అందులో భాగంగా పవన్‌ని సంప్రదించారని తెలుస్తుంది. మరి ఇందులుఓ నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పవన్‌ దిల్‌రాజుతో కాకుండా నిర్మాత పుల్లారావుకి కూడా ఓ సినిమాకి ఓకే చెప్పారట. ఆయన్నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి దర్శకెవరు అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పవన్‌ మాత్రం ఇలా వరుసగా సినిమాలకు ఓకే చెప్పడం ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేస్తుంది.

click me!