పెళ్ళికి బయలుదేరిన పవన్ కళ్యాణ్‌.. ఇదిగో సాక్ష్యం

Surya Prakash   | Asianet News
Published : Dec 08, 2020, 07:36 PM ISTUpdated : Dec 08, 2020, 07:38 PM IST
పెళ్ళికి బయలుదేరిన  పవన్ కళ్యాణ్‌.. ఇదిగో సాక్ష్యం

సారాంశం

గత కొన్ని రోజులుగా రాజకీయ పర్యటనలు, నిరసనలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి హాజరౌతారా? లేదా? అనే డౌట్స్ అందరిలో నెలకొన్నాయి. కానీ తన తమ్ముడు వస్తున్నాడని తెలుపుతూ నాగబాబు ఫొటో షేర్‌ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఆ ఫొటోను మీరు ఇక్కడ చూడవచ్చు.  

మొత్తానికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఆయన గత కొన్ని రోజులుగా రాజకీయ పర్యటనలు, నిరసనలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి హాజరౌతారా? లేదా? అనే డౌట్స్ అందరిలో నెలకొన్నాయి. కానీ తన తమ్ముడు వస్తున్నాడని తెలుపుతూ నాగబాబు ఫొటో షేర్‌ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఆ ఫొటోను మీరు ఇక్కడ చూడవచ్చు.

మరో ప్రక్క పెళ్లి కూతురు నిహారిక పూల్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రీ-వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఈ పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా కునాల్‌ రావల్‌ రూపొందించిన లావెండర్‌ గౌనులో నిహారిక మెరిసారు. ఈ పార్టీలో తీసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హాట్ గా మారింది. ఇక  వరుణ్‌ తేజ్‌ తన చెల్లెలు నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాడని అల్లు అర్జున్‌ అన్నారు. ‘నా సోదరుడి పట్ల ఎంతో గర్వపడుతున్నా’ అని ఫొటో షేర్‌ చేశారు.  అంతేకాదు తన సతీమణి స్నేహారెడ్డి సంగీత్‌ పార్టీలో అందంగా కనిపించిందని ఆమె స్టిల్‌ పంచుకున్నారు. 

కాబోయే భర్త చైతన్యతో కలిసి పెదనాన్న చిరంజీవి పాటలకు స్టెప్పులేశారు. తన చిట్టి చెల్లెల్ని అన్నయ్య వరుణ్ తేజ్‌ భుజాలపై మోసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మామయ్య నాగబాబుతో కలిసి అల్లు అర్జున్‌ హంగామా చేస్తున్న మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వధూవరులు ‘బాయ్స్‌’ సినిమాలోని ‘అలే అలే..’ పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ప్రీ-వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం మెహందీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు