ప్రకాష్‌రాజ్‌కి ఫ్రీగా ఎన్నికల ప్రచారం చేసి పెట్టిన పవన్.. వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

By Aithagoni RajuFirst Published Sep 26, 2021, 8:18 AM IST
Highlights

`మా` ఎన్నికల(maa election) బరిలో ఉన్న ప్రకాష్‌రాజ్‌(prakash raj)కి ఫ్రీగా ఎన్నికల ప్రచారం చేసి పెట్టాడు పవన్‌(pawan kalyan). `మా` ఎన్నికలు అక్టోబర్‌ 10న జరగబోతున్నాయి. అయితే రెండు నెలల క్రితమే `మా` అధ్యక్ష బరిలో తాను ఉన్నట్టు, తన ప్యానెల్‌ని కూడా ప్రకటించారు ప్రకాష్‌ రాజ్‌. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ శనివారం సాయంత్రం జరిగిన సాయిధరమ్‌ తేజ్‌ `రిపబ్లిక్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అవేశానికి గురయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో `మా` ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్‌రాజ్‌కి ఫ్రీగా ఎన్నికల ప్రచారం చేసి పెట్టాడు పవన్‌. `మా` ఎన్నికలు అక్టోబర్‌ 10న జరగబోతున్నాయి. అయితే రెండు నెలల క్రితమే `మా` అధ్యక్ష బరిలో తాను ఉన్నట్టు, తన ప్యానెల్‌ని కూడా ప్రకటించారు ప్రకాష్‌ రాజ్‌. 

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ ప్రకటించినప్పుడు లోకల్‌, నాన్‌లోకల్‌ అనే వాదన తెరపైకి వచ్చింది. మన `మా`ని మనమే కాపాడుకుందామని పరోక్షంగా కామెంట్లు రావడం, కొందరు బహిరంగంగానే ఈ వాదనని తెరపైకి తీసుకురావడంతో వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో `రిపబ్లిక్‌` ఈవెంట్‌లో పవన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. మనం ఇండియన్‌ రిపబ్లిక్‌ లో ఉన్నామని, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయోచ్చని అన్నారు. రాజకీయ నాయకులు ఎక్కడినుంచైనా పోటీ చేస్తున్నారు. అలాంటి ప్రకాష్‌ రాజ్‌ చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. 

కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనే భేదం లేదని స్పష్టం చేశారు. ప్రకాష్‌ రాజ్‌కి ఇక్కడ పోటీ చేసే హక్కు ఉందని, ఆయనకు ఓటు వేయాలా? లేదా? అనేది ఓటర్ల ఇష్టమని, కానీ ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదన్నారు. అభిప్రాయాల పరంగా నేను, ప్రకాష్‌రాజ్‌ విభేదించుకుంటామని, కానీ సినిమాలో నటించాల్సి వస్తే, సోదర భావంతోనే యాక్ట్ చేస్తామని, వాదనలు, విమర్శలు సినిమా బయటే అని తెలిపారు. షూటింగ్‌లో అంతా ఫ్రెండ్లీగానే ఉంటామని స్పష్టం చేశారు. 

ఓ రకంగా ప్రకాష్‌రాజ్‌కి కావాల్సినంత ప్రచారాన్ని చేసి పెట్టాడు పవన్‌. మొదట్నుంచి మెగా ఫ్యామిలీ ప్రకాష్‌రాజ్‌కి సపోర్ట్ చేస్తున్నారనే టాక్‌ ఉంది. దాన్ని తాజాగా పవన్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రకాష్‌రాజ్‌కి పోటీగా బరిలో నిల్చున్న మంచు ఫ్యామిలీకి చురకలంటించారు పవన్‌. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంతో మీకు సంబంధాలున్నాయి, సానుభూతిపరులుగా ఉన్నారు. పైకా కుటుంబ రిలేషన్స్ కూడా ఉన్నాయి. కానీ చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెడుతుంటే ఎందుకు మాట్లాడరని మోహన్‌బాబుని పవన్‌ ప్రశ్నించారు. ఆయన కాలేజీలను కూడా జాతీయం చేయండి అంటూ సెటైర్లు వేశాడు. 

అంతేకాదు ఈ వేదికగా చిత్ర పరిశ్రమలోని పెద్దలకు, అందరిపై ఫైర్‌ అయ్యాడు పవన్‌. ఏపీలో థియేటర్లని, సినిమాలను ప్రభుత్వం శాసిస్తుంటే మీరంతా చూస్తూ కూర్చోవడమేంటని ప్రశ్నించారు. ప్రైవేట్‌ డబ్బుతో తీసిన సినిమాలపై ప్రభుత్వ పెత్తనమేంటంటూ విరుచుకుపడ్డారు. దీనిపై సినీ పరిశ్రమ పెద్దలు మాట్లాడాలని, అది మన హక్కు అని తెలిపారు. బ్రతిమాలుకోవడం కాదని, నిలదీయాలని, పోరాడాలని తెలిపారు. ఇకనైనా దీనిపై ముందుకొచ్చి మాట్లాడాలని, అందరు కలిసి కట్టుగా ఉండాలని తెలిపారు. 

ఒక్క హీరో కోసం లక్షల మంది కార్మికుల పొట్టగొట్టడం కరెక్ట్ కాదని, కేవలం రెండు వేల కోట్ల విలువ చేసే సినీ పరిశ్రమపై ఈ బోడి పెత్తనమేంటంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు పవన్‌. దమ్ముంటే నా సినిమాలు ఆపండి, కానీ మిగిలిన వారిని ఇబ్బంది పెట్టొందని హితవు పలికారు. చిత్ర పరిశ్రమ జోలికొస్తే మాడి మస్సైపోతారని వార్నింగ్‌ ఇచ్చారు పవన్‌. అదే సమయంలో తన సినిమాలను అడ్డుకునే దమ్ముందా అంటూ, అడ్డుకుంటేచూస్తూ ఊరుకుంటామా అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మొత్తంగా `రిపబ్లిక్‌` వేదికగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు పవన్‌.

click me!