
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ ల మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది అయితే ఈసారి యుద్ధం మొదలైంది దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్ పోస్టర్ వల్ల . ఆ పోస్టర్ ఎందుకు కారణం అనేగా మీ డౌట్ . అల్లు అర్జున్ డ్రైవ్ చేస్తున్న స్కూటర్ ఈ వివాదానికి కారణం.
డీజేలో అల్లు అర్జున్ స్కూటర్ నెంబర్ AP16EA 2425 కాగా గబ్బర్ సింగ్ లో పవన్ బండి నెంబర్ AP27GS 2425 ఇది దాంతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. గతంలో తన సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని ఫ్యాన్స్ అరుస్తున్న సమయంలో... చెప్పను బ్రదర్ ! అంటూ పవన్ ఫ్యాన్స్ కు అర్జున్ గట్టిగా సమాధానం ఇవ్వడంతో అప్పటి నుండి అల్లు అర్జున్ ని పవన్ ఫ్యాన్స్ వెంటాడటం మొదలు పెట్టారు.
ఇప్పుడు మళ్లీ స్కూటర్ నెంబర్ రూపంలో అవకాశం రావటంతో.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై సెటైర్లు వేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. దానికి బదులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు. అలా పవన్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ మళ్లీ మొదలైంది.