బీభత్సం సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, థియేటర్ లో విధ్వంసం, లక్షల్లో ఆస్తి నష్టం

By Mahesh JujjuriFirst Published Sep 2, 2022, 3:52 PM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రెచ్చిపోయారు. పలు థియేటర్లలో  రచ్చ రచ్చ చేశారు. అటు కర్నూల్ లో రాళ్లు రువ్విన వారు.. ఇటు వైజాగ్ లో నానా బీభత్సం సృష్టించారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది. 
 

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. వారం ముందు నుంచే ప్లెక్సీలు..బ్యానర్లతో సందడి చేస్తున్నారు. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జల్సా సినిమా .. స్పెషల్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం చేశారు. అంతే కాదు ఈ సినిమా ఎన్నో సార్లు టీవీలో ప్రసారం అయినా సరే.. థియేటర్ లో  మళ్లీ చూడటానికి అభిమానులు క్యూ కట్టారు. ఇక ఈరోజు జల్సా రిలీజ్ అయిన థియేటర్లు దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. దానితో పాటు.. పలుచోట్ల పవర్ స్టార్ అభిమానుల వల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. థియేటర్లపై ధాడులు కూడా జరిగాయి. 

పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్బంగా  అంతగా జల్సా సినిమా 4కె  రిలీజ్ అవ్వగా.. విశాఖపట్నంలోని పలు థియేటర్లలో కూడా రిలీజ్ అయ్యింది. ఇక ఒక  థియేటర్ లో  పవన్‌ అభిమానులు బీభత్సం సృష్టించారు. వైజాగ్‌లోని లీలా మహల్‌ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో హంగామా సృష్టించిన పవన్‌ ఫ్యాన్స్‌ బీర్‌ బాటిల్స్‌ పగలకొట్టి నానీ హంగామా చేశారు.  స్క్రీన్ ను చించేశారు.

అంతే కాదు  బీరు బాటిల్స్ లో హడావిడిచేసిన వారు.. సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్‌ కూడా డామేజ్‌ చేశారు. పేపర్‌ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్‌ పరిస్థితిని చాలా దారుణంగా మార్చేశారు. ఈ చర్యతో  థియేటర్‌ యాజమాన్యం తలపట్టుకుంది. ఏం చేయాలో తోచని పరిస్థితి.  పవన్‌ అభిమానులు చేసిన ఈ పనివల్ల థియేటర్ ఓనర్స్ కు దాదాపుగా 20 లక్షల వరకూ నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది. 

 అంతే కాదు అంతకు ముందు రోజు కూడా ఈ సినిమా  రిలీజ్ లో భాగంగా.. కర్నూల్ లోని  శ్రీరామ థియేట‌ర్‌ లో  సినిమాను ప్రదర్శించారు. అయితే అక్కడ కూడా  భారీ ఎత్తున తరలి వచ్చిన పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్.... సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా థియేట‌ర్‌లో సౌండ్ సిస్ట‌మ్ స‌రిగా లేద‌ని  ఆందోళ‌న‌కు దిగారు. చాలా సేపు ఆందోళనలు చేసిన  ఈ క్ర‌మంలోనే...  సహనం కోల్పోయిన  ఫ్యాన్స్..  థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చి రాళ్ల‌తో థియేట‌ర్‌పైకి దాడికి దిగారు. 

click me!