హరీశ్ శంకర్ ను క్షమించమని కోరిన పవన్ కళ్యాణ్ అభిమాని.. ఏమైందంటే?

By Asianet News  |  First Published May 13, 2023, 5:57 PM IST

దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని విధంగా ట్రీట్ అందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ తో మరింత అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో పవన్ అభిమాని పెట్టిన ఓ ట్వీట్ కు హరీశ్ శంకర్ రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  - హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో భారీ రెస్పాన్స్ దక్కింది. పలు సెలబ్రెటీలతో,  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనకు నచ్చిందంటూ స్పందించారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల విషయానికొస్తే ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరీశ్ శంకర్ కు థ్యాంక్స్ లు చెబుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

అయితే, కొద్దిరోజులుగా హరీశ్ శంకర్ ను ఇబ్బంది పెట్టేలా కొందరు నెటిజన్లు ట్వీట్ పెడుతూ వచ్చారు. పరుషపదాలను కూడా వాడారంట. దీంతో హరీష్ శంకర్ వారిని బ్లాక్ చేస్తూ వచ్చారు. దీనిపై తాజాగా హరీష్ శంకర్ కి పవన్ అభిమాని ఒకరు ట్వీట్ చేశారు. ‘అన్నా ఫస్ట్ టైమ్ గిల్టీగా ఫీల్ అవుతున్నా. క్షమించండి అన్నా. మిమ్మల్ని చాలా తప్పుగా అర్ధం చేసుకున్నాం. ఒక్క గ్లింప్స్ తో అందరి నోళ్లు మూయించావ్. నా ఆనందం మాటల్లో చెప్పలేను. థాంక్యూ అన్నా. బ్లాక్ చేసిన ఫ్యాన్స్ ని బ్లాక్ చేసిన వారిని అన్ బ్లాక్ చేయన్న  ప్లీజ్’ అంటూ ట్వీట్ చేశారు. 

Latest Videos

undefined

దీనికి హరీశ్ శంకర్ ఆసక్తికరంగా రిప్లై ఇవ్వడం నెట్టింట వైరల్ గా మారింది. ‘మనలో మనకు గిల్టీ ఏంటి తమ్ముడు.. మనమందరం ఒక్కటే సినిమా. బూతులు వాడిన వాల్లని మాత్రమే బ్లాక్ చేశాను. విమర్శలకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ కన్వర్జేషన్ ఆసక్తికరంగా మారింది. 

పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో థియేటర్లు బద్దలు కానున్నాయి. 2024లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.  ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ లోకేషన్స్ సర్చింగ్ లో ఉన్నారు. అటు డబ్బింగ్ ఎడిటింగ్ వర్క్ కూడా ప్రారంభమైంది.

 

Manalo manaku guilty enti Thammudu…. We all are one let’s enjoy CINEMA 😍😍😍😍
Boothulu use chesina vallani maatrame block chesaa
am always open to criticism… https://t.co/EFOWLMGiZw

— Harish Shankar .S (@harish2you)
click me!