
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీగా తలపడతాయి. హంగ్ రావడం ఖాయం. జేడీఎస్ అధినేత కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని అంచనాలు వేశారు. ఎగ్జిట్ పోల్స్ సైతం దీన్నే ధృవీకరించాయి. అనూహ్యంగా కాంగ్రెస్ సంపూర్ణత ఆధిక్యత సాధించింది. ఎవరి మద్దతు లేకుండా సొంతగా ప్రభుత్వాన్ని స్థాపించింది. ఏళ్ల అనంతరం కాంగ్రెస్ అరుదైన విజయాన్ని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై హీరోయిన్ ప్రణీత సుభాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రణీత... ఈ ఫలితాల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ప్రాతినిధ్యం విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కేవలం వందల ఓట్ల తేడాతో పలువురు అభ్యర్థులు ఓటమి చెందారు. కాబట్టి సరైన అభ్యర్థులను ఎంచుకోవడం చాలా అవసరం... అని కామెంట్ చేశారు.
ప్రణీత ట్వీట్ వైరల్ అవుతుంది. బీజేపీ పార్టీ తరపున శాండిల్ వుడ్ స్టార్స్ క్యాంపైన్ చేశారు. కిచ్చా సుదీప్, దర్శన్ ప్రచారంలో పాల్గొన్నారు. మన తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం సైతం బీజేపీ కాండిడేట్ తరపున క్యాంపైన్ చేశారు. బ్రహ్మానందం మద్దతు తెలిపిన కాండిడేట్ డాక్టర్ సుధాకర్ ఓడిపోయాడు. ఆయన బీజేపి గవర్నమెంట్ లో మంత్రిగా చేయడం విశేషం. రాజకీయాల్లో స్టార్ మేనియా పనికిరాదని ఇంకోసారి రుజువైంది. ఇక ప్రణీత తీరు చూస్తుంటే ఆమె బీజేపి ఓటమికి బాధపడుతున్నారనిపిస్తుంది.