సంప్రదిస్తే సాయం చేస్తా... సేవాగుణం చాటుకున్న రేణూ దేశాయ్!

By team teluguFirst Published May 12, 2021, 7:23 AM IST
Highlights

 పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, కోవిడ్ బాధితలుకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదిస్తే సహాయం చేస్తానంటూ ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశం అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. రోజుకు లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడుతుండగా, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రులలో బెడ్లు అందుబాటులో లేకపోవడం, రోగులకు అవసరమైన ఆక్సిజన్ కొరత అనేక మంది ఉసురు తీస్తుంది. కోవిడ్ రోగుల సహాయార్థం ఇప్పటికే అనేక మంది ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు రోగులకు కావలసిన ఆక్సిజన్ సరఫరాతో పాటు వైద్య సేవలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 


తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, కోవిడ్ బాధితలుకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదిస్తే సహాయం చేస్తానంటూ ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు. ప్లాస్మా, ఆక్సిజన్  వంటి అత్యవసర వైద్య సేవలు అవసరమైన కరోనా  రోగులు ఇంస్టాగ్రామ్ లో తనకు మెసేజ్ పెడితే వారికి వైద్య సహాయం సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అయితే నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ పెట్టాలని గట్టిగా చెప్పారు. గతంలో ఎదురైన ఛేదు అనుభవాల దృష్ట్యా, తాను ఇలా ప్రత్యేకంగా చెబుతున్నట్లు రేణూ దేశాయ్ తన వీడియో సందేశంలో తెలియజేశారు. 


అయితే తాను ఎటువంటి ఆర్థిక సాయం చేయలేనని రేణూ దేశాయ్ చెప్పడం గమనార్హం. ఇక చాలా కాలం సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న రేణూ దేశాయ్, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. అలాగే టీవీ సీరియల్స్ తో పాటు, పలు బుల్లితెర కార్యక్రమాలలో ఆమె మెరుస్తున్నాడు. కెరీర్ కోసం పూణే నుండి హైదరాబాద్ కి మకాం మార్చిన రేణూ దేశాయ్, నటిగా బిజీ అయ్యారు. కోవిడ్ బాధితులకు సాయం చేస్తానంటూ ముందుకు వచ్చిన ఆమె, తనలోని మానవతాదృక్పధం చాటుకున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu (@renuudesai)

click me!