
గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు రూపమే “ప్లే బ్యాక్”. సుకుమార్ వద్ద పలు చిత్రాలకు వర్క్ చేసిన హరిప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రం గత రెండేళ్లుగా విడుదల కోసం నానా ఇబ్బందులూ పడి ఎట్టకేలకు మార్చి 5 థియేటర్లలో విడుదలైంది. “హుషారు” ఫేమ్ దినేష్ తేజ్, “మల్లేశం” ఫేమ్ అనన్య కీలకపాత్రలు పోషించిన ఈ స్కి-ఫై థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటిలో వచ్చేస్తోంది.
2021లో విడుదలైన మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా మే 14 నుంచి తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతుంది. జక్కా హరి ప్రసాద్ దర్శకుడు.అనేక ట్విస్టులు, టర్న్స్‌తో రెండు వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు (2019లోని అబ్బాయి..1993లోని అబ్బాయి) మధ్య నడిచే థ్రిల్లర్ అంశాలతో నడిచే సినిమా ఇది.
ప్రముఖ దివంగత జరల్నిస్ట్, నటుడైన టి.ఎన్.ఆర్‌లోని ఫెర్పామర్‌ను సరికొత్త కోణంలో ఎలివేట్ చేసిన చిత్రమిది. ఆయన పోషించిన పాత్రల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. కె.బుజ్జి సినిమాటోగ్రఫీ, కమ్రాన్ గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ‘ప్లే బ్యాక్’ మూవీ ప్రేక్షకులతో ఆదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ‘ఆహా’తో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరింత మంది సినీ ప్రేక్షకులను అలరించనుంది.
2021న ‘ఆహా’లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు, ఒరిజినల్స్, వెబ్ సిరీస్‌లైన ‘క్రాక్’, ‘నాంది’, ‘గాలి సంపత్’, ‘లెవన్త్ అవర్’, ‘థ్యాంక్ యు బ్రదర్’, ‘మెయిల్’, ‘సుల్తాన్’ సినిమాల సరసన ఈ ‘ప్లే బ్యాక్’ మూవీ కూడా చేరనుంది. ప్రేక్షకుల ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందిస్తామని చెప్పిన మాటను నిజం చేస్తూ, ఈ వేసవిలో వినోదపు ఆకలిని ‘ఆహా’ తీరుస్తుందనే మాట మాత్రం నిజం అంటున్నారు.