పోసానికు పవన్ కళ్యాణ్ కౌంటర్, కుక్కలతో...

Surya Prakash   | Asianet News
Published : Sep 28, 2021, 10:04 AM IST
పోసానికు పవన్ కళ్యాణ్ కౌంటర్, కుక్కలతో...

సారాంశం

 ‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఏపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సైతం పవన్‌ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు. 

 ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపఫ్యంలో పవన్‌ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పవన్‌ చేసిన కామెంట్స్‌పై పోసాని స్పందించారు. ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ పవన్‌ రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడని ఆయన ఆరోపించారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందంటూ తనదైన శైలిలో మాట్లాడారు పోసాని.

 అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తే ఆయనికి గుడి కడుతాను అంటూ ఒక పంజాబీ హీరోయిన్ ప్రస్తావన తీసుకొచ్చారు. సుదీర్ఘంగా సాగిన పోసాని ప్రసంగం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

“తుమ్మెదల ఝుంకారాలు
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …” అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

అంతేకాదు, 20 ఏళ్ల క్రితం విడుదలైన సూపర్ హిట్ పాప్ సాంగ్ “హూ లెట్ ది డాగ్స్ అవుట్” (ఈ కుక్కలను బయటికి ఎవరు వదిలారు) అనే పాట యూట్యూబ్ లింక్ ని పోస్ట్ చేశారు. ఈ పాట తనకి బాగా ఇష్టమంటూ పవన్ పంచ్ పడింది. 
 

PREV
click me!

Recommended Stories

Nivetha Thomas: రష్మిక, శ్రీలీల, ఇప్పుడు నివేదా థామస్‌.. ఏఐ ఫేక్‌ ఫోటోలకు బలి.. నటి స్ట్రాంగ్‌ వార్నింగ్
Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇంట్లో పెద్ద చిచ్చే పెట్టిన వల్లి, ధీరజ్ పై కత్తి ఎత్తిన ప్రేమ