
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. సాధారణంగానే ప్రతి ఏడాది పవన్ పుట్టినరోజు వేడుకలని అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారు. అలాంటిది ప్రతిష్టత్మక 50 పుట్టినరోజు ఇంకెత గ్రాండ్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఒక రోజు ముందే పవన్ జన్మదిన వేడుకల హంగామా సోషల్ మీడియాలో మొదలైపోయింది. టాలీవుడ్ లో ప్రతి అకేషన్ కి ట్విట్టర్ స్పేస్ ఆనవాయితీగా మారుతోంది. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సెలెబ్రిటీలతో స్పేస్ నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డేకి కూడా స్పేస్ జరగబోతోంది. ఈ స్పేస్ కి ప్రముఖ సెలెబ్రిటీలు పాల్గొనబోతున్నారు. యంగ్ డైరెక్టర్ బాబీ, పవన్ తో హరిహర వీరమల్లు తెరకెక్కిస్తున్న క్రిష్, పవన్ భక్తుడు బండ్ల గణేష్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, బ్రహ్మాజీ, నిర్మాత నీలిమ, సంజన గల్రాని, అనూప్ రూబెన్స్, వరుణ్ సందేశ్, కిరణ్ అబ్బవరం, భాస్కర భట్ల పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పేస్ లో పాల్గొనబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు బర్త్ డే సెలెబ్రేషన్స్ న గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు, పట్టణాల్లో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హరిహర వీర మల్లు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రాల నుంచి అభిమానులకు సర్ ప్రైజ్ లు రెడీగా ఉన్నాయి.