డల్లస్ లో బాలకృష్ణ ‌- పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు

Published : Jan 03, 2023, 09:53 AM IST
డల్లస్ లో బాలకృష్ణ ‌- పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు

సారాంశం

బాలకృష్ణ ‌, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్ మొదలయ్యింది. విమర్షల పరిది దాటిపోయి.. దాడుల వరకూ వెళ్ళిపోయింది. డల్లాస్ లో పవన్ , బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగి పలువురికి గాయాలు  అయ్యాయి.   

బాలయ్య, -పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవలు రచ్చకెక్కాయి. వీధికెక్కి కొట్టుకునే స్థాయికి వచ్చాయి. అయితే ఇదంతా ఇక్కడ కాదు డల్లస్ లో.  న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన వేడుకల్లో బాలయ్య, పవన్ అభిమానులు పాల్గొన్నారు. వారి మధ్య చిన్నగా స్టార్ట్ అయిన గొడవ.. మాటామాటా పెరిగి కొట్టాడుకునేవరకూ వచ్చింది. ఈక్రమంలో బాలయ్యపై పవన్ అభిమానుల మాటలకు కోపం ఆపుకోలేకపోయిన ఎన్నారై కేసి చేకూరి.. పవన్ ఫ్యాన్స్ పైకి దాడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం. 

వివరాల్లోకి వెళ్తే.. డల్లస్ లో 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్యాన్స్ తో పాటు.. పవన్ ఫ్యాన్స్ కూడా పాల్గొన్నారు. ఈక్రమంలో జై బాలయ్య , జై పవన్ అంటూ ఇరు వార్గాలు నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈక్రమంలోనే వారి మధ్య మాటా మాటా పెరిగి దాడుల వరకూ వెళ్ళింది. దాంతో అక్కడి ఈవెంట్ మేనేజర్లు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఈ దాడిలో వారికి కూడా గాయాలు అయ్యాయి. దాంతో ఈవెంట్ మేనేజర్లు పోలీసులను ఆశ్రయించడంతో... వారు వచ్చి అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. 

ఈక్రమంలో బాలయ్య అభిమాని ఎన్నైరా కేసీ చేకూరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అక్కడి నుంచి డల్లస్ స్టేషన్ కు చేకూరిని తరలించారు. ఇక ఈ ఘర్షణతో పలువురికి గాయలు అవ్వగా వారు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈక్రమంలో చేకూరికి బెయిల్ కోసం తానా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడి గొడవంతా అన్ స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ రావడంతో.. ఈ విషయంలోనే మాటా మాట పెరిగి గొడవకు దారి తీసినట్టు సమాచారం. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం