పవన్ కల్యాణ్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై టీమ్ దృష్టి సారించింది. అదే సమయంలో నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం బిజినెస్ పై దృష్టి పెట్టారు.
తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జీ వారికి అమ్మేసారు. ఆయన చేసిన మరో భారీ చిత్రం ఎఫ్ 3తో పాటు ఈ సినిమాని కలిపి జీ వారికి శాటిలైట్ రైట్స్ ఇచ్చారని వినికిడి. ఏప్రియల్ 9న రిలీజ్ కు రెడీ అవుతున్న వకీల్ సాబ్ శాటిలైట్ రేటు బాగా పలికినట్లు చెప్తున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రూ. 15 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు డిజిటల్ రైట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొందని.. శాటిలైట్ రైట్స్ కన్నా ఎక్కువ డిజిటల్ రైట్స్ కు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని చెప్తున్నారు.
ఇక పవన్, శృతి హాసన్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా.. మగువా’ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. ’’ అన్నారు.సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కోర్టు సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో కట్ అయ్యిన టీజర్ రికార్డ్స్ సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి.