పవన్ కొత్త సినిమానూ అనౌన్స్ చేశారు.. మరీ హరీశ్ శంకర్ ‘భవదీయుడు’ పరిస్థితి ఏంటి?

Published : Dec 04, 2022, 06:36 PM ISTUpdated : Dec 04, 2022, 06:39 PM IST
పవన్ కొత్త సినిమానూ అనౌన్స్ చేశారు.. మరీ హరీశ్ శంకర్  ‘భవదీయుడు’ పరిస్థితి ఏంటి?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో ‘భవదీయుడు భగత్ సింగ్’ పట్టాలెక్కాల్సి ఉండగా.. సుజీత్ తో కొత్త సినిమాను  ప్రకటించారు. దీంతో ఈ క్రేజీ కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందనే ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.  

‘గబ్బర్ సింగ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో సినిమా చేయబోతున్నారు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత శంకర్ నెక్ట్స్ సినిమాను పవన్ తోనే అనౌన్స్ చేశారు. అంతకు ముందు నుంచే పవర్ స్టార్ కోసం ఈ డాషింగ్ డైరెక్టర్ వేయిట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ ప్రొగ్రామ్స్, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘హరిహర వీరమల్లు’ కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్’లో నటించనున్నారు. 

కానీ తాజాగా పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth)తో సినిమాను ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, హరిహర వీరమల్లు తర్వాత వెంటనే Bhavadeeyudu Bhagat Singh నుంచి అప్డేట్ వస్తుందని అందరూ ఎదరుచూస్తున్న తరుణంలో సుజీత్ తో కొత్త సినిమాను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. దీంతో హరీశ్ శంకర్ సినిమా ఇప్పట్లో ఉంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో పవన్ కూడా ఓ ఈవెంట్ లో హరీశ్ తో సినిమా పక్కాగా ఉంటుందని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు. 

ఈ క్రమంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎప్పటి నుంచో కథను సిద్ధం చేసిన పవన్ కోసం హరీశ్ శంకర్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాలుగేండ్లు పూర్తైనట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా కథలో మార్పులు చేస్తున్నారని సమాచారం. ఈ నెలలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు