
టాలీవుడ్ లో మళ్ళీ సినిమాల సందడి మొదలైంది. ఫిబ్రవరి మొదలుకుని సమ్మర్ మొత్తం సందడి చేసేందుకు భారీ చిత్రాలు రెడీ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెండు అవుతోంది. ఆ తేదీన కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని కూడా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు.
ఫిబ్రవరి 25నే విడుదల చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఫైనల్ కాపీ కూడా రెడీ అయింది. ఇక విడుదల కావడమే ఆలస్యం. కాగా రీసెంట్ గా భీమ్లా నాయక్ ప్రివ్యూని పవన్ కళ్యాణ్, రానా చిత్ర సభ్యులతో కలసి ప్రసాద్ ల్యాబ్స్ లో వీక్షించినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన పవన్ కళ్యాణ్ ఫైనల్ అవుట్ పుట్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారట.
భీమ్లా నాయక్ తిరుగులేని విజయం సాధిస్తుందనే నమ్మకం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ కూడా మూవీపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, రానా మధ్య సన్నివేశాలు, ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయినట్లు టాక్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ భీమ్లా నాయక్ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని కామెంట్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానాకి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.