వరుణ్ తేజ్, లావణ్య వెడ్డింగ్ కోసం.. ఇటలీ బయలుదేరిన పవన్, అన్నా లెజినోవా దంపతులు

Published : Oct 28, 2023, 12:02 PM IST
వరుణ్ తేజ్, లావణ్య వెడ్డింగ్ కోసం.. ఇటలీ బయలుదేరిన పవన్, అన్నా లెజినోవా దంపతులు

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. 

మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి. ఇక వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేయడమే మిగిలి ఉంది. 

ఇటలీలో వివాహం కావడంతో మూడు రోజుల ముందుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అక్కడికి వెళ్లారు. నాగబాబు కుటుంబ సభ్యులంతా ఇటలీ చేరుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక్కొక్కరు ఇటలీ వెళుతున్నారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాతో కలసి సతీసమేతంగా ఇటలీ బయలుదేరారు. 

ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ వెళుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. దీనితో పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు. ఈ దృశ్యాలని పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. 

నవంబర్ 1న ఇటలీలో పెళ్లి జరగనుండగా.. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనితో రిసెప్షన్ కి సంబందించిన ఇన్విటేషన్ శుభలేఖలని అతిథులందరికి పంచుతున్నారు. శుభలేఖకి సంబందించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.   

శుభలేఖ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని V, L అక్షరాలతో లోగో డిజైన్ చేశారు. ఇక లోపల పైభాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకట్రావు ఆశీస్సులతో అని ముద్రించారు. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం అంటూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ పేర్లని హైలైట్ చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌