కమెడియన్ కొడుకుతో హీరో అర్జున్ కూతురి నిశ్చితార్థం.. రింగులు మార్చుకున్న ఐశ్వర్య- ఉమాపతి

By Mahesh Jujjuri  |  First Published Oct 28, 2023, 11:27 AM IST

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ బిగినింగ్ లోనే వివాహ బంధంలో అడుగు పెట్టబోతోంది హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్.  ఇండస్ట్రీలోని ప్రముఖ నటుడి కుమారుడిని ప్రేమ వివాహం చేసుకోబోతోంది. 
 


హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ బిగినింగ్ లోనే వివాహ బంధంలో అడుగు పెట్టబోతోంది హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్.  ఇండస్ట్రీలోని ప్రముఖ నటుడి కుమారుడిని ప్రేమ వివాహం చేసుకోబోతోంది. 

ప్రముఖ నటుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య  వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హీరోయిన్ గా తమిళనాట ఇంటర్డ్యూస్ అయిన ఐశ్వర్య.. టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూశారు. కాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చాలా కాలం నుంచి  కోలీవుడ్ దిగ్గజ నటుడు తంబి రామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య ప్రేమలో ఉన్నారు. తాజాగా వీరి వివాహ నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా  ప్రేమించుకుంటుండగా అక్టోబర్ 27న చెన్నైలో నిశ్చితార్థం జరిగింది. 

Latest Videos

ఈ నిశ్చితార్ధ వేడుకలకు.. ఇరువురి కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఉమాపతి రామయ్య, ఐశ్వర్య ప్రేమ కాస్త చిత్రంగా స్టార్ట్ అయ్యింది. హీరో  అర్జున్ హోస్ట్ గా  వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గోవడంతో ఇరుకుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య ప్రేమపడ్డారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో  చెప్పి పెళ్లి ప్రతిపాదన చేశారు. అయితే ఈ పెళ్లికి ఇరుకుటంబాలు ఎటువంటి అనుమానం లేకుండా  అంగీకరించడంతో..  వివాహానికి లైన్ క్లియర్ అయ్యింది. 

ఇక ఉమాపతి తండ్రి తంబి రామయ్య తమిళ సినిమాలో స్టార్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఆయన  ప్రముఖ హాస్యనటుడిగా, సహాయ నటుడిగాను చాలా సినిమాల్లో నటించారు. ఆయన కొడుకు ఉమాపతి కూడా నటుడిగా కోలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య  కూడా హీరోయిన్ గా  ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013లో పట్టట్టు యానై అనే తమిళ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తమిళ సినిమాలు చేసుకుంటూ.. 2018లో ప్రేమ బరా అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అయ్యింది. 

ఇక అర్జున్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సొల్లివిడువా గాలో హీరోయిన్ గా నటించింది ఐశ్వర్య. ఇక తెలుగులో కూడా ఆమెను హీరోయిన్ గా ఇంటర్డ్యూస్ చేయాలి అనిచూశాడు అర్జున్. కాని ఆసినిమా చిత్రమైన పరిస్థితుల్లో ఆగిపోయింది. హీరోగా విశ్వక్ సేను ను తీసుకుని.. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు అర్జున్. కాని ఆతరువాత వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి.. ఈ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నారు. దాంతో ఆసినిమా అలానే ఆగిపోయింది. ఈ సినిమా కాస్త వివాదంగా కూడా మారింది. 
 

click me!