పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట తీవ్ర విషాదం!

Published : May 15, 2021, 08:43 AM ISTUpdated : May 15, 2021, 08:46 AM IST
పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట తీవ్ర విషాదం!

సారాంశం

మాజీ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కేశ్పల్లి ఆనంద్ రెడ్డి మరణించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న  కేశ్‌పల్లి  ఆనందరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా ప్రాణాలు విడుస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనేక మంది ఆర్టిస్ట్ ల ఉసురు తీస్తుంది. మరికొందరు అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మాజీ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి కేశ్పల్లి ఆనంద్ రెడ్డి మరణించారు. 
 

టీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న  కేశ్‌పల్లి  ఆనందరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.60ఏళ్ల ఆనంద్ రెడ్డి గుండెనొప్పికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో అడ్మిట్‌  చేశారు. ఆసుపత్రిలో చేరిన కొంత సమయానికే ఆయన మరణించినట్లు డాక్టర్స్ ధృవీకరించారు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి తనయుడు. మొదట యూత్ లీడర్‌గా పని చేసిన ఆనంద్ రెడ్డి.. 2014లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. 


ఆనందరెడ్డి కుమార్తె కీర్తి రెడ్డి స్టార్ హీరోయిన్ గా పలు భాషల్లో నటించారు. పవన్ హీరోగా 1998లో విడుదలైన తొలిప్రేమ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించడం విశేషం. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కాగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక అక్కినేని హీరో సుమంత్ ని కీర్తి రెడ్డి  2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐతే పెళ్ళైన రెండేళ్లకే 2006లో విడాకులు తీసుకొని విడిపోయారు వీరిద్దరూ. విడాకులు అనంతరం కీర్తి రెడ్డి మరో వివాహం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?