హ్యాపి బ‌ర్త్ డే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

Published : Sep 02, 2017, 08:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
హ్యాపి బ‌ర్త్ డే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

సారాంశం

అక్కడ అబ్బాయ్ ఇక్కడ అమ్మాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప‌వ‌ర్ స్టార్  ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హిరో ప‌వ‌న్ క‌ళ్యాణ్  టాలీవుడ్ పవర్ స్టార్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే నేడు

 


ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హిరో ప‌వ‌న్ క‌ళ్యాణ్. మెగా  ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ మొదటి నుంచి తన టాలెంట్, స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈ రోజు. 1971 సెప్టెంబర్ 2న వెంకట్ రావు – అంజన దేవి దంపతులకు జన్మించిన పవన్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే ఈ రోజు.


1996లో ‘అక్కడ అబ్బాయ్ ఇక్కడ అమ్మాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తను చేసిన ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్డం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వ‌చ్చిన  సినిమాలు నిరుత్సాహపరిచినా 2012 లో ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

 ఆ తర్వాత 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు.పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలిసి న‌టించి గోపాల గోపాల సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.త‌రువాత వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్2 ప్రేక్ష‌కుల‌ని ఊర్రుత‌లలూగించింది.నటుడిగానే కాకుండా ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించాడు. 

2014 ఎన్నికల్లో సెంట్రల్ లో బిజెపికి, రాష్రంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో ఎంతో దూకుడుగా వ్యవహరించి ఆ పార్టీల గెలుపుకి అతను ఓ కారణమయ్యాడు. సినిమాలతో పాటు తన జనసేన పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్  ఉన్నా చాలా సింపుల్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎషియా నెట్ న్యూస్   తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ
Gunde Ninda Gudi Gantalu: వామ్మో రోహిణీ మామూలు ఆడది కాదు, నిమిషంలో ప్లేట్ తిప్పేసింది, మరోసారి బకరా అయిన మనోజ్