Pooja Hegde:సల్లూ భాయ్...పూజా హెగ్డే తో ఏంటా చిలిపి చేష్టలు! (వీడియో)

Surya Prakash   | Asianet News
Published : Feb 28, 2022, 10:12 AM IST
Pooja Hegde:సల్లూ భాయ్...పూజా హెగ్డే తో  ఏంటా చిలిపి చేష్టలు! (వీడియో)

సారాంశం

. ఈవెంట్‌లో భాగంగా పూజా హెగ్డేతో కలిసి తన 'కిక్' చిత్రంలోని 'జుమ్మీ కి రాత్' అనే పాటకు సల్మాన్ డాన్స్ చేశాడు. ఆ పాటలోని హుక్‌స్టెప్‌ను పూజాతో సల్లు భాయ్  ప్రయత్నం చేశాడు.


 బాలీవుడ్ స్టార్ హీరో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌ కు ఉన్న క్రేజ్ తెలిసిందే. అలాగే అదే సమయంలో అతి తక్కువ టైమ్ లో ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అలా  డాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోపై జోక్స్ పేలుతున్నాయి.  స్టార్ హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలిసి సల్మాన్ చేసిన స్టెప్పులపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే...

  'డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్' అనే ఈవెంట్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, దిశా పటానీ, సోనాక్షి సిన్హాతో పాటు అనేక మంది స్టార్లు పాల్గొన్నారు. ఈవెంట్‌లో భాగంగా పూజా హెగ్డేతో కలిసి తన 'కిక్' చిత్రంలోని 'జుమ్మీ కి రాత్' అనే పాటకు సల్మాన్ డాన్స్ చేశాడు. ఆ పాటలోని హుక్‌స్టెప్‌ను పూజాతో సల్లు భాయ్  ప్రయత్నం చేశాడు. పూజా ముందు నడుస్తుండగా.. ఆమె డ్రెస్‌ను పంటితో పట్టుకోవడంలో విఫలమయ్యాడు.

ఒరిజినల్ 'జుమ్మీ కి రాత్' పాటలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముందుకు నడుస్తున్నప్పుడు ఆమె కోటును సల్మాన్ ఖాన్ తన పళ్లతో పట్టుకుని ఓ హుక్‌స్టెప్ వేస్తాడు. అయితే 'డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్' ఈవెంట్‌లో పూజా హెగ్డే పొట్టి డ్రెస్ వేసుకోవడంతో.. సల్మాన్ హుక్‌స్టెప్‌ను వేయడంలో విఫలమయ్యాడు. పూజను ఆపి మరీ ఆ స్టెప్ వేయడానికి ప్రయత్నించినా.. డ్రెస్ పెద్దగా లేకపోవడంతో అది కుదరలేదు. దాంతో పూజా సహా సల్మాన్ కూడా నవ్వుకున్నారు. ఆ వీడియోని షేర్ చేస్తూ జనం కామెడీ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు