Valimai:చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు.. ఫలితం ఇల్లే

Surya Prakash   | Asianet News
Published : Feb 28, 2022, 10:33 AM IST
Valimai:చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు.. ఫలితం ఇల్లే

సారాంశం

 తెలుగులో అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. భీమ్లానాయక్ మీదే అందరి దృష్టీ ఉంది. కార్తికేయ ఉన్నా కూడా ఇక్కడ తెలుగు మార్కెట్ లో మ్యాజిక్ జరగలేదు. ఈ నేపధ్యంలో సినిమా ఫ్లాఫ్ టాక్ కు కారణాలు అన్వేషించారు. డ్యూరేషన్ ఎక్కువ అవటం వల్లే ఫ్లాఫ్ అని నిపుణులు తేల్చారు. 

అజిత్ కొత్త  సినిమా వస్తోందంటే తమిళనాడులో ఉండే హంగామానే వేరు. ఇక తెలుగులోనూ అజిత్ కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలోనే ఉన్నారు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన వలీమై కు తమిళనాట భారీ స్దాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ థియోటర్స్ ముందు బారులు తీరారు. అయితేనేం వీకెండ్ కూడా పూర్తవకుండానే ఆ వేడి చల్లారింది. తెలుగులో అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. భీమ్లానాయక్ మీదే అందరి దృష్టీ ఉంది. కార్తికేయ ఉన్నా కూడా ఇక్కడ తెలుగు మార్కెట్ లో మ్యాజిక్ జరగలేదు. ఈ నేపధ్యంలో సినిమా ఫ్లాఫ్ టాక్ కు కారణాలు అన్వేషించారు. డ్యూరేషన్ ఎక్కువ అవటం వల్లే ఫ్లాఫ్ అని నిపుణులు తేల్చారు. రివ్యూలలో కూడా అదే మాట వినపడింది. దాంతో టీమ్ కత్తెర పట్టుకుంది.

తమిళ, తెలుగు వెర్షన్స్ 12 నిముషాల మేరకు ట్రిమ్ చేసినట్లు సమాచారం. ఇంక హిందీలో బోనీ కపూర్ రిలీజ్ చేసిన ఈ చిత్రంకు అక్కడ 18 నిముషాలు ట్రిమ్ చేసారు. ఓ పాటను సైతం లేపేసారు. అయినా ఫలితం ఏ మాత్రం మెరుగుపడలేదు. యాక్షన్ అభిమానులకు కొన్ని ఎపిసోడ్స్ నచ్చుతున్నాయి. అంతకు మించి ఈ సినిమాపై టాక్ లేదు.
 
  చిత్రం కథేమిటంటే... నరేన్‌(కార్తికేయ) టెక్నికల్ ఎక్సపర్ట్. మహా తెలివైనవాడు. అయితే తన తెలివిని వక్రమార్గంలో వాడుతూ.. క్రైమ్స్  చేస్తూంటాడు. వైజాగ్ లో ఉండే యూత్ ని  ‘సైతాన్‌ స్లేవ్స్‌’అనే  పేరుతో డ్రగ్స్‌ బానిసలుగా మార్చేసి, చైన్‌ స్నాచింగ్‌, మర్డర్స్ చేయిస్తూంటాడు.  తన తెలివితో పోలీస్ లను ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకుంటూంటాడు. అతన్ని, అతని గ్యాంగ్ అంతు తేల్చటానికి ఏసీపి అర్జున్‌(అజిత్‌) రంగంలోకి దూకుతాడు. నరేన్ ని పట్టుకోవటానికి ఓప్లాన్ చేస్తాడు. కానీ రివర్స్ లో అర్జున్ నే అతను ఇరికిస్తాడు. అక్కడ నుంచి ఇధ్దరి మధ్యా వార్ మొదలవుతుంది. చివరకు అర్జున్ ...నరేన్ ని ఎలా పట్టుకున్నాడు. సైతాన్ గ్యాంగ్ ఏర్పాటు చేయటం వెనక నరేన్ ఉద్దేశ్యం ఏమిటి...చివరకు‘సైతాన్‌ స్లేవ్స్‌’ఏమైంది?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు