
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిపబ్లిక్ డే రోజున జనవరి 26న పఠాన్ దేశవ్యాప్తంగా రూ. 70 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మొదటి రోజే 55 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లోని అన్ని రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. హాలిడే ఫ్యాక్టర్ కారణంగా పఠాన్ రెండవ రోజు కలెక్షన్స్ 70 కోట్లు దాటింది. బాలీవుడ్‌లో టాప్ వీకెండ్ రికార్డు అయిన సంజు 119 కోట్లు వసూలు చేసింది, దీనిని పఠాన్ కేవలం రెండు రోజుల్లో అధిగమించాడు. ఇక అసలైన ఊచకోత...ఈ చిత్రం ఓవర్సీస్‌లో జరుగుతోంది. అక్కడ మామూలుగా లేదు. మొదటి రోజు దాదాపు 5 మిలియన్లు వసూలు చేసింది, దాంతో పఠాన్ యొక్క ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106 కోట్లు.
పఠాన్‌తో షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌లో తన సింహాసనాన్ని తిరిగి దక్కించుకున్నాడు. డైరక్టర్ గా SS రాజమౌళి లేకపోయినా, ప్రశాంత్ నీల్ లేకపోయినా ఈ రికార్డ్ క్రియేట్ చేసారు. అలాగే మరో ప్రక్క బాయ్‌కాట్ కాల్స్ ని కూడా ఈ సినిమా దాటింది. దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు, ప్రమోషన్‌లు లేనప్పటికీ, పఠాన్ టాప్ 5 ఇండియా గ్రాసర్స్‌లో ఉండి ఆశ్చర్యపరిచారుడ. పఠాన్ బాలీవుడ్‌కి గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. ఇక వీకెండ్ వచ్చేసింది కాబట్టి పఠాన్ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇదే స్పీడుని మాత్రం కంటిన్యూ చేస్తే మాత్రం తొలి వారంలోనే రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల గ్రాస్‌ను రాబడుతుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ 65 శాతం ఆక్యుపెన్సీతో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తమిళ్, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ల నుంచి మరో రూ. 3 కోట్ల వసూళ్లు సమకూరాయి. ఈ మూవీకి సిద్ధార్ధ్ ఆనంద్ కధ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్ధ యష్‌రాజ్ పిల్మ్స్ నిర్మించింది.