'బిగ్ బాస్ 3' హోస్ట్ గా నాగార్జున.. పరుచూరి కామెంట్స్!

Published : Jul 09, 2019, 05:15 PM IST
'బిగ్ బాస్ 3' హోస్ట్ గా నాగార్జున.. పరుచూరి కామెంట్స్!

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ 3పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఎలాంటి తడబాటు లేకుండా నాగ్ హోస్టింగ్ చేశారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ 3పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఎలాంటి తడబాటు లేకుండా నాగ్ హోస్టింగ్ చేశారు. నాగార్జున బుల్లితెర అప్పియరెన్స్ కు ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ షోలో నాగార్జున ఎలా వ్యవహరిస్తాడో అనే ఆసక్తి నెలకొని ఉంది. 

నాగార్జున బిగ్ బాస్ లో మెరవనుండడంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి బిగ్ బాస్ సీజన్ లో ఎన్టీఆర్ మాస్ గా చేశాడు. రెండవ సీజన్ లో నాని క్లాస్ గా చేశాడు. మూడవ సీజన్ లో నాగార్జున మన్మథుడిలా చేయబోతున్నాడని అన్నారు. 

లోపల ఉన్న 14మంది సభ్యుల వ్యక్తిత్వాలని బయట కూర్చుని విశ్లేషణ చేయడం అంత సులువైన విషయం కాదని పరుచూరి అభిప్రాయ పడ్డారు. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు కాబట్టి మహిళా ప్రేక్షకులు బిగ్ బాస్ షోకు పెరుగుతారని.. 14 మంది సభ్యులని చూడాలో, నాగార్జునని చూడాలో తెలియక తికమక పడతారని వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?
ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?