భారీ కుంభకోణంలో స్టార్ హీరోకి నోటీసులు!

Published : Jul 09, 2019, 04:54 PM IST
భారీ కుంభకోణంలో స్టార్ హీరోకి నోటీసులు!

సారాంశం

వెస్ట్ బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. 

వెస్ట్ బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. ఈ కుంభకోణంలో ప్రముఖ నటుడు, బెంగాల్ స్టార్ హీరో ప్రసేన్ జిత్ ఛటర్జీ హస్తం ఉందంటూ మంగళవారం నాడు సమన్లు జారీ చేసింది.

2010-12 మధ్యకాలంలో రోజ్ వ్యాలీ కంపనీ పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. దీనిపై జూలై 19లోపు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ విషయం ఇప్పుడు బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ లో సంచలనంగా మారిన రోజ్ వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా ఈ కుంభకోణంపై దుమారం చెలరేగింది.

బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మెహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని, పాతిక కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో ఆయన ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: ఆరెంజ్ చీరలో శోభిత వైరల్ లుక్..పెళ్ళిలో అదరగొట్టేసిందిగా
Agadha: ’అగధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి.. మరిచిపోలేం