Latest Videos

ఛీ ఛీ.. ఆ స్టార్ హీరో బట్టలు లేకుండా పక్కన వచ్చి కూర్చుంటాడు.. హీరోయిన్ కామెంట్స్

By tirumala ANFirst Published May 26, 2024, 10:55 AM IST
Highlights

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా పరిణీతి చోప్రా సినిమాలు కొనసాగిస్తోంది.   

పరిణీతి చోప్రా తాజాగా ఓ స్టార్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎంత క్రేజ్ సొంతంచేసుకున్నాడో అంతే బోల్డ్ గా ఉంటాడు. అతడి ఘనకార్యాలు చిట్టాని పరిణీతి చోప్రా విప్పింది. 

రణ్వీర్ సింగ్, పరిణీతి చోప్రా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ లేడీస్ వర్సెస్ రిక్కీ బహెల్, బ్యాండ్ బాజా భారత్ లాంటి చిత్రాల్లో నటించారు.  లేడీస్ వర్సెస్ రిక్కీ బహెల్ చిత్రంతోనే పరిణీతి చోప్రా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనితో ఆమెకి రణ్వీర్ తో మంచి బాండింగ్ ఉంది. 

అయితే రణ్వీర్ చేసే చేష్టలు షూటింగ్ లొకేషన్ లో భరించడం కష్టం అంటూ ఫన్నీగా తెలిపింది. రణ్వీర్ సింగ్ సరిగ్గా బట్టలు వేసుకోడు. ఒక్కోసారి ఒంటిమీద బట్టలు లేకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. ఒకసారి ప్యాంట్ లేకుండా వచ్చి పక్కన కూర్చున్నాడు. 

ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని చెబితే అప్పుడు వేసుకుని వస్తాడు. అతడి క్యారవాన్ లోకి వెళ్లంటే భయం. ఏ స్థితిలో ఉన్నాడో అని కంగారు పడుతూ వెళ్ళాలి. అందుకే లోపలి రావచ్చా అని అడిగి వెళతా. కొన్నిసార్లు అడిగి వెళ్లినా బట్టలు లేకుండా దర్శనం ఇస్తాడు అని పరిణీతి పేర్కొంది. బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావు ? అని అడిగితే.. నన్ను అలా చూడడం వల్ల ఎవరికీ నష్టం లేదు కదా అని సిగ్గు లేకుండా చెబుతాడు. 

ఒకసారి రొమాంటిక్ సీన్ లో ప్యాంట్ లేకుండా వచ్చాడు. నాకు ఇలా ఉంటే ఇబ్బంది.. స్క్రిప్ట్ లో ఉన్నట్లు మాత్రమే చేద్దాం అని చెబితే ప్యాంట్ వేసుకుని వచ్చాడు అని పరిణీతి తెలిపింది. 

click me!