ఇంగ్లీష్ మాట్లాడలేవా..? నటుడిని అవమానించే ప్రయత్నం!

Published : Nov 24, 2018, 10:14 AM IST
ఇంగ్లీష్ మాట్లాడలేవా..? నటుడిని అవమానించే ప్రయత్నం!

సారాంశం

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించారు. తాజాగా ఆయన గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్నారు. 

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించారు. తాజాగా ఆయన గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ అందరికీ అర్ధమయ్యే విధంగా ఆయన ఇంగ్లీష్ భాషలో మాట్లాడాల్సి వచ్చింది.

అయితే పంకజ్ మాత్రం తాను ఇంగ్లీష్ లో మాట్లాడలేనని  చెప్పారు. దీంతో అక్కడున్న ఒక వ్యక్తి 'నేను కొరియా నుండి వచ్చాను.. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితేనే నాకు అర్ధమవుతుందని' అన్నారు. 

దీనిపై స్పందించిన పంకజ్.. ''నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేను.. హిందీలో మాట్లాడగలను. దీనిని ఎవరైనా సరే అనువదించవచ్చు'' అని అన్నారు. అప్పుడు శ్రోతల్లో మరొక వ్యక్తి కలుగజేసుకొని.. ''మీరు జీన్స్ ధరించారు.. కానీ ఇంగ్లీష్ లో మాట్లాడలేనంటున్నారే?'' అని అడిగాడు.

ఆ మాటకి పంజక్ 'ఏ వయసులో మనం భాష నేర్చుకుంటామో.. ఆ సమయంలో మనం స్వయంగా జీన్స్ వేసుకోలేం కదా' అని సమాధానమిచ్చాడు. ఆయన సమాధానం విన్నవారంతా చప్పట్లు కొడుతూ పంకజ్ ని అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

Nidhhi Agerwal: సెట్‌లో ప్రభాస్‌ ఉండేది ఇలానే.. డార్లింగ్‌ గురించి `ది రాజా సాబ్‌` హీరోయిన్‌ ఏం చెప్పిందంటే
MSG Day 2 Collection: బాక్సాఫీసు వద్ద మన శంకర వర ప్రసాద్‌ గారు ర్యాంపేజ్‌.. చిరంజీవి సక్సెస్‌ పార్టీ