రవితేజ రెమ్యునరేషన్ ముందు వసూళ్లు తుస్సు!

By Udayavani DhuliFirst Published Nov 24, 2018, 9:41 AM IST
Highlights

సీనియర్ హీరో రవితేజ తన రెమ్యునరేషన్ గా రూ.10 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తుంటాడు. తనకు అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధమయ్యే నిర్మాతలతోనే పని చేశుంటాడు. ఈ మధ్య కాలంలో హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని తన పారితోషికంగా డిమాండ్ చేస్తున్నాడని టాక్. 

రీసెంట్ గా నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో అతడికి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా వెళ్లిందని సమాచారం. రవితేజ తీసుకునే రెమ్యునరేషన్  అంత కూడా అతడి సినిమాలు వసూళ్లు సాధించడం లేదనేది ఇప్పుడు నిర్మాతల్లో గుబులు రేపుతోంది.

అతడు నటించిన 'టచ్ చేసి చూడు', 'నేల టికెట్టు' వంటి సినిమాలను పది కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నాడు రవితేజ. కానీ ఆ సినిమాలు తొమ్మిది కోట్ల షేర్ తో సరిపెట్టుకున్నాయి. ఇప్పుడు 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా పరిస్థితి మరీ ఘోరంగా ఉందనే చెప్పాలి. ఈ సినిమా ఆరు కోట్ల లోపు షేర్ తోనే సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రవితేజ మార్కెట్ చూసిన నిర్మాతలు ఇప్పుడు అతడితో సినిమాలు చేయడానికి భయపడుతున్నారు. కనీసం ఆయన రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమాలు తీసే సాహసం  చేయొచ్చు కానీ రవితేజ మాత్రం కథల మీద కంటే తన రెమ్యునరేషన్ మీదే ఎక్కువ ద్రష్టి పెడుతున్నారనే సెటైర్లు వేస్తున్నారు. 

click me!