Ranga Ranga Vaibhavanga: సమ్మర్ దాటాకే వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’.. రిలీజ్ డేట్ వచ్చేసింది..

Published : Mar 30, 2022, 05:23 PM ISTUpdated : Mar 30, 2022, 05:24 PM IST
Ranga Ranga Vaibhavanga: సమ్మర్ దాటాకే  వైష్ణవ్  తేజ్ ‘రంగరంగ వైభవంగా’.. రిలీజ్ డేట్ వచ్చేసింది..

సారాంశం

మెగా హీరో, పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 

రొమాంటిక్ డ్రామా ‘ఉప్పెన’ మూవీతో (Vaishnav Tej) తెలుగు ఇండస్ట్రీలోకి అడుగెట్టాడు. ఈ చిత్రంతోనే సినీ రంగ ప్రవేశం చేసి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు నెలకొల్పారు. డెబ్యూ మూవీతోనే వైష్ణవ్ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడంతో ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి. కొత్త దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన (Uppena) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హీరో ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపొలం (Kondapolam) మూవీ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేకపోయింది. ఇక వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాడు.

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్‘రంగరంగ వైభవంగా’ (Ranga ranga vaibhavanga) రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్‌’ మూవీలో నటించి, కుర్రకారు మనసులు కొల్లగొట్టిన కేతికా శర్మ (Ketika Sharma) హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రాన్ని ఆదిత్య వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఆ మధ్య రంగరంగ వైభవంగా నుంచి విడుదలైన రొమాంటిక్‌ టీజర్‌, పోస్టర్స్ ఆడియెన్స్ ను అలరించాయి. ఈ చిత్రంలో కేతికా శర్మ, వైష్ణవ్ తేజ్ పేర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పటికే చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆడియెన్స్ కు మూవీ రిలీజ్ పై అప్డేట్ అందించారు మేకర్స్. మే 27న రిలీజ్ కావాల్సిన చిత్రాన్ని జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. కాగా, మార్చి, ఏప్రిల్, మేలో పెద్ద స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతుండగా.. సేఫ్ సైడ్ గా జూలైలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే