Ram Charan: రాంచరణ్ తో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డీల్.. రెండు సినిమాలకు కాంట్రాక్ట్ ?

Published : Mar 30, 2022, 03:52 PM ISTUpdated : Mar 30, 2022, 03:53 PM IST
Ram Charan: రాంచరణ్ తో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ డీల్.. రెండు సినిమాలకు కాంట్రాక్ట్ ?

సారాంశం

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దేశం నలువైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తన ఆశయం కోసం ఆవేశాన్ని అణుచుకుని ఉన్న పోలీస్ పాత్రలో రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దేశం నలువైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తన ఆశయం కోసం ఆవేశాన్ని అణుచుకుని ఉన్న పోలీస్ పాత్రలో రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా చిత్రం కావడంతో రాంచరణ్, ఎన్టీఆర్ నటన గురించి హిందీ ప్రేక్షకులను బాగా చర్చించుకుంటున్నారు. 

టాలీవుడ్ నుంచి మరో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ రెడీ అయ్యారు అంటూ బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ కి బాలీవుడ్ నుంచి అవకాశాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాంచరణ్ తో క్రేజీ డీల్ కుదుర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికోసం రాంచరణ్ కి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ లో భాగంగా రాంచరణ్ తో రెండు సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు ఆ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా లేదు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సాలిడ్ గా ఈ న్యూస్ వినిపిస్తోంది. 

అయితే రాంచరణ్ బాలీవుడ్ ఆఫర్స్ పై ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  రాంచరణ్.. మరో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా రాంచరణ్ ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు ముగిశాక రాంచరణ్ తన బాలీవుడ్ చిత్రాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే