షాకింగ్ గా ఉంది : “పల్లెవాసి” టీజర్

By Prashanth MFirst Published Jan 26, 2019, 2:44 PM IST
Highlights

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”. ఈ చిత్రం టీజర్ ఈ  రోజు విడుదల అయ్యింది. టీజర్ చూస్తూంటే.. రైతు సమస్యల చుట్టూ ఈ కథ తిరగతుందని అర్దమవుతోంది.  టీజర్ ఇలా ఓ సమకాలీన సమస్యను సూటిగా స్పృశిస్తూ కట్ చేయటం చాలా అరుదు. ఆ విషయంలో టీమ్ ని అభినందించాల్సిందే. 

"బాగుపడదామని అమెరికా వెళ్లాను. కానీ బాగు ఎక్కడుంది. నా ఊరిలో ఉంది. నా జనాల మధ్య, నా మట్టిలో, నా పొలంలో  ఉంది.నిజానికి సొంతూర్లో చావటం కూడా అదృష్టమే". అనే డైలాగుతో టీజర్ సాగింది. ఈ టీజర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఉంది. 

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”. ఈ చిత్రం టీజర్ ఈ  రోజు విడుదల అయ్యింది. టీజర్ చూస్తూంటే.. రైతు సమస్యల చుట్టూ ఈ కథ తిరగతుందని అర్దమవుతోంది.  టీజర్ ఇలా ఓ సమకాలీన సమస్యను సూటిగా స్పృశిస్తూ కట్ చేయటం చాలా అరుదు. ఆ విషయంలో టీమ్ ని అభినందించాల్సిందే. 

ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్.   మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు.  

చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాధ్ మాట్లాడుతూ పల్లెటూరి నేపధ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా “పల్లెవాసి”. ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ముఖ్యంగా సినిమాలో రాకేందు మౌళి నటన అందరి హృదయాలను కట్టిపడేస్తుంది. సందీప్ అందించిన స్వరాలకు వెన్నెల కంటి, రాకేందు మౌళిల సాహిత్యం చక్కగా కుదిరింది. కథలో భాగంగా వచ్చే పాటలు అందరినీ అలరిస్తాయి. ఇక వేసవి కాలంలో కుండలోని నీరంత చల్లగా..చలి కాలంలో చలి మంటంత వెచ్చగా...కరువు నేలలో పండిన వేరు శనగంత రుచిగా... తొలకరికి నెర్రలు దాచిన నేల పరిమలాంటి అనుభూతి ని 'పల్లెవాసి' కచ్చితంగా కలిగిస్తుందని అన్నారు. 

నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ..ఇటీవలే షూటింగ్ పూర్తి అయింది. అనుకున్న బడ్జెట్ లో తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయగలిగాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే 'పల్లెవాసి ' ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

click me!