బాబాయ్ ఎలా ఉంటాడో చెప్పే పాట ఇది: రామ్ చరణ్

Published : Jan 26, 2019, 12:26 PM IST
బాబాయ్ ఎలా ఉంటాడో చెప్పే పాట ఇది: రామ్ చరణ్

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానుల ప్రేమ ఏ విధంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే బాబాయ్ పై కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలానే తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానుల ప్రేమ ఏ విధంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే బాబాయ్ పై కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలానే తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు. రాజకీయ పరంగా కూడా చరణ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తుండడం మంచి పరిణామమే అని చెప్పవచ్చు. 

ప్రస్తుతం పవన్ కు సంబందించిన ఒక ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఒకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతి గొలుప..’ అంటూ సాగె పాటను చరణ్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా  ‘నా దృష్టిలో.. లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది’ అంటూ చరణ్ తన వివరణను ఇచ్చాడు. 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ పాట అభిమానులను జన సైనికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ చేపట్టిన కార్యక్రమాలపై ఈ పాటను జనసేన పార్టీ రూపొందించింది.

                                          

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు