కరోనా నేపథ్యంలో మరో సినిమా.. `పలాస` హీరో ప్రయోగం

Published : Jun 18, 2020, 03:58 PM IST
కరోనా నేపథ్యంలో మరో సినిమా.. `పలాస` హీరో ప్రయోగం

సారాంశం

పలాస 1978 తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కు "W H O" (World Hazard Ordinance ) అనే టైటిల్ ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమాలు కూడా రూపొందుతున్నాయి. ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్‌ పేరుతో ఓ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్సాన్స్‌ వచ్చింది. తాజాగా కరోనా నేపథ్యంలోనే మరో సినిమా రూపొందుతున్నట్టుగా ప్రకటించారు.

పలాస 1978 తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కు "W H O" (World Hazard Ordinance ) అనే టైటిల్ ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్  థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. 

తాజాగా హీరో రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్ కి మంచి స్పందన లభిస్తుంది. "I'm gonna tell god everything" వంటి వైవిధ్య మైన హాలీవుడ్ షార్ట్ ఫిలిం తో విమర్శకుల ప్రశంసలు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథ తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు.

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?