ఈ నిశ్శబ్దం చాలా మాట్లాడుతుంది.. సుశాంత్ మృతిపై యాక్షన్‌ హీరో

By Satish ReddyFirst Published Jun 18, 2020, 2:28 PM IST
Highlights

సుశాంత్ చనిపోయిన తరువాత విద్యుత్‌ స్పందించలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ జమ్వాల్‌ స్పదించాడు. ఓ వ్యక్తి `హేయ్ విద్యుత్‌, సుశాంత్‌ గురించి స్పందించలేదేంటి` అంటూ చేసిన కామెంట్‌పై యాక్షన్ స్టార్ స్పందించాడు. `నువ్వు వినగలిగితే నిశ్శబ్దం కూడా ఎంతో మాట్లాడుతుంది` అంటూ కామెంట్ చేశాడు విద్యుత్‌ జమ్వాల్‌.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నుంచి బాలీవుడ్‌ సినీ పరిశ్రమ కోలుకోలేకపోతోంది. షాక్ నుంచి తేరుకున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అయితే  ఈలోగా నెటిజెన్లు కొంత మంది బాలీవుడ్‌ ప్రముఖులను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల కృతి సనన్‌ను ఇలాగే ట్రోల్ చేశారు నెటిజెన్లు, తరువాత ఆమె తన బాధను వ్యక్తపరచటంతో పాటు నెటిజెన్లపై కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ను కూడా అలాగే ట్రోల్‌ చేస్తున్నారు.

సుశాంత్ చనిపోయిన తరువాత విద్యుత్‌ స్పందించలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ జమ్వాల్‌ స్పదించాడు. ఓ వ్యక్తి `హేయ్ విద్యుత్‌, సుశాంత్‌ గురించి స్పందించలేదేంటి` అంటూ చేసిన కామెంట్‌పై యాక్షన్ స్టార్ స్పందించాడు. `నువ్వు వినగలిగితే నిశ్శబ్దం కూడా ఎంతో మాట్లాడుతుంది. కనీరు కూడా రాకపోవటం, స్పందించడానికి మాటలు కూడా లేకపోవటం, పదే పదే తలుచుకోవటం కూడా ఆవేదనను వ్యక్త పరిచే మార్గమే. చనిపోయిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులకు చూడనప్పుడు ఎవరికోసం ట్వీట్లు చేయటం?  అందరూ స్పందిస్తారు. నేను మౌనంగా స్పందిస్తా` అంటూ కామెంట్ చేశాడు విద్యుత్‌ జమ్వాల్‌.

ఈ నెల 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అభిమానులతో సినీ, రాజకీయా, క్రీడా ప్రముఖులు సుశాంత్ మృతికి సంతాపం తెలియజేశారు. అయితే సుశాంత్‌ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ సినీ పెద్దలు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది సినీ ప్రముకలు మానసికంగా వేదించిన కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Silence speaks volumes if you stop & listen. Absent tears/ inability to write heartfelt eulogies and remembrances could also be a way of expressing grief,Neither the departed soul nor the family is reading the Tweets ,so who to write for? We all grieve and mourn- i do it quietly. https://t.co/YJks0oaV1D

— Vidyut Jammwal (@VidyutJammwal)
click me!