
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ట్రిపుల్ ఆర్ సినిమా. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్.. విమర్శకులు ప్రశంసలు అందుకుంటుంది. ఈక్రమంలో ప్రపంచ దిగ్గజ దర్శకులు అవతార్ ఫేమ్ జేమ్స్ కామరాన్ , స్పిల్ బర్గ్ లాంటి వారు కూడా ఈసినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాజమౌళిని కలిసి అభినందించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు కూడా ఈసినిమాలో మంచి మార్కులు పడ్డాయి. స్వయంగా జేమ్స్ కామరూన్ చరణ్ నటనను ప్రసంసించారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈసినిమా నుంచి నాటు నాటుసాంగ్ ఆస్కార్ అవార్డ్ కునామినేట్ అయ్యింది.
ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత గోల్గెన్ గ్లోబ్ అవార్డ్ నుసాధించిన నాటునాటు సాంగ్.. అన్ని దేశాలలో సెలబ్రిటీలను డాన్స్ చేయిస్తోంది. కొంత మంది ఈసాంగ్ కు డాన్స్ చేసి సోషల్ మీడియాల షేర్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో నాటు నాటు పాటకు తాజాగా పాకిస్థాన్ నటి తనదైన స్టైల్లో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది.పాకిస్థాన్ లో టాప్ స్టార్ గా వెలుగుతున్న నటుల్లో ఒకరైన హనియా ఆమిర్ నాటు నాటు పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేసి అందరిని ఆకర్శించింది. ఓ పెళ్ళి వేడుకలో నటుడు సబూర్ అలీ తో కలిసి స్టెప్పులు ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డుల ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌తోపాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ను ఈ ఏడాది సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అస్కార్ బరిలో నిలిచింది. అయితే ఈ పాటకు ఆస్కార్ పక్కా అంటున్నారు సినీపండితులు.