బ్రేకింగ్: 'భీమ్లా నాయక్' మొగిలయ్యకు పద్మశ్రీ.. కిన్నెర కళాకారుడికి గొప్ప గౌరవం

Published : Jan 25, 2022, 09:01 PM IST
బ్రేకింగ్: 'భీమ్లా నాయక్' మొగిలయ్యకు పద్మశ్రీ.. కిన్నెర కళాకారుడికి గొప్ప గౌరవం

సారాంశం

శభాష్ 'భీమలా నాయకా' అంటూ దర్శనం మొగిలయ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి రుచి చూపించాడు మొగులయ్య.

శభాష్ 'భీమలా నాయకా' అంటూ దర్శనం మొగిలయ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అంతరించి పోతున్న కిన్నెర కళని ఈ తరానికి రుచి చూపించాడు మొగులయ్య. అంతకు ముందు వరకు మొగిలయ్య ఎవరికీ తెలియదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ కోసం ప్రారంభ లిరిక్స్ ని మొగిలయ్య తనదైన శైలిలో పాడి మెప్పించారు. 

భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలయ్యాక మొగిలయ్యని పలు మీడియా సంస్థలు పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేశాయి. దీనితో మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా మొగిలయ్య కిన్నెర కళని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 

ఇది మొగిలయ్యకు, కిన్నెర కళకు దక్కిన గొప్ప గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ విభిన్నంగా ఉండాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ భావించారు. 

అందుకే మొగిలయ్య ప్రతిభని గుర్తించి ఆయనతో భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడించారు. ఈ పాట పాపులర్ అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా మొగిలయ్యని అభినందించిన సంగతి తెలిసిందే. మొగిలయ్యకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం కూడా చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా