చిరంజీవికి యూఎస్ ఫ్యాన్స్ ఘన సన్మానం... ఆసక్తికరంగా పాన్ ఇండియా ఫిల్మ్ ‘రికార్డ్ బ్రేక్’ ట్రైలర్.!

Published : Feb 19, 2024, 11:45 PM ISTUpdated : Feb 20, 2024, 10:12 AM IST
చిరంజీవికి యూఎస్ ఫ్యాన్స్ ఘన సన్మానం... ఆసక్తికరంగా పాన్ ఇండియా ఫిల్మ్ ‘రికార్డ్ బ్రేక్’ ట్రైలర్.!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి యూఎస్ అభిమానులు ఘన సన్మానం చేశారు. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం రికార్డు బ్రేకింగ్ (Record Breaking) ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇటు కెరీయర్, అటు ఫ్యామిలీతో క్వాలిటీ సమయం గడుపుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు కుటుంబంలో జరిగే అన్ని ఫంక్షన్లకు పెద్దగా నిలుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక రీసెంట్ గా చిరు తన స్నేహితుడు కుమారుడి పెళ్లి కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూఎస్ లో ఉన్న అభిమానులు చిరంజీవికి ఘనంగా సన్మానం చేశారు. పద్మ విభూషణ్ వరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 

పాన్‌ ఇండియా మూవీగా `రికార్డ్ బ్రేక్‌`.. ట్రైలర్‌ ఎలా ఉందంటే..

చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమాని అందించిన దర్శకులు అజయ్ కుమార్ గారు గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ, ట్రైలర్ ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్ గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?