
ప్రతి ఏడాది గణతంత్ర దినత్సవానికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా Padma Awards 2024ను ప్రకటించింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లను అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు, నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పను ప్రభుత్వం పద్మశ్రీ Padma Shri అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్న వారి పేర్లను కూడా ప్రకటించారు.