హీరో సిద్ధార్థ్ నటించిన ‘ఓయ్!’ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీరిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ రంగ 12 ఏళ్ల నుంచి దాచి పెట్టిన రహస్యాన్ని తాజాగా రివీల్ చేశారు.
ఇదిలా ఉంటే... ‘ఓయ్’ చిత్రం 2009లో విడుదలైంది. కానీ పెద్దగా ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. కథ, సన్నివేశాలు, సాంగ్స్ బాగానే ఉన్నా... ఎందుకో బ్లాక్ బాస్టర్ కాలేకపోయింది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు ఆనంద్ రంగ (Anand Ranga) గుర్తుచేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. 15 ఏళ్ల తర్వాత Oy! సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పుకొచ్చారు.
undefined
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెద్ద బ్లాక్ బాస్టర్ కాకపోయినా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓయ్ చిత్రం రీరిలీజ్ అవుతోంది. అప్పుుడు సినిమాలో ఉన్న ప్రతి డిటేయిల్స్ ను గుర్తించిన రివ్యూయర్లకు ధన్యవాదాలు.. నేను ఇప్పుడు టైటిల్ వెనుక ఉన్న విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ చిత్ర టైటిల్ మణిరత్నం మూవీలోని అమ్మాయిలు పిలిచే పిలుపు నుంచి కూడా అయ్యి ఉండొచ్చు. కానీ మొదటి ఈ చిత్రానికి ‘పరుగు’ అనే టైటిల్ ను ఎంచుకున్నాను. కానీ అప్పటికే ఆ చిత్రం వచ్చేసింది. మళ్లీ స్క్రిప్ట్ రాయడం ప్రారంభించాను. టైటిల్ తోనే సంధ్య, ఉదయ్ ను పిలుస్తుంది. అది చాలా చిత్రాల్లో. అందరి ఇంట్లో వినిపించే పదమే. ఇంక మీరు గమనిస్తే.. 1 జనవరి 2017న ఉదయ్ సంధ్య ప్రేమకథ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే అతని తండ్రి సంక్రాంతికి చనిపోయాడు. అలాగే సంధ్య వాలెంటైన్స్ డే గురించి మాట్లాడుతుంటుంది. హోలీ, సమ్మర్, వినాయక చవితి, క్రిస్టమస్ ఇలా అన్నీ పండగలనూ చూపించాను. 2008 జనవరి 1న సంధ్య చనిపోతుంది. అప్పటి నుంచి ఉదయ్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవడం మానేస్తాడు. ఇలా ఉదమ్ ప్రేమ కథ మొత్తం ఏడాదిలోనే ఉంటుంది. One Year - Oy!! ఇలా టైటిల్ ను ఫిక్స్ చేశాం.’ అని చెప్పుకొచ్చారు.