నటి జయప్రద షాక్ ఇచ్చిన కోర్ట్.. అరెస్టుకు రంగం సిద్ధం..?

Published : Feb 13, 2024, 02:45 PM IST
నటి జయప్రద షాక్ ఇచ్చిన కోర్ట్..  అరెస్టుకు రంగం సిద్ధం..?

సారాంశం

సీనియర్ నటి జయప్రదకు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఆమె అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. కోర్టు ధిక్కరణ విషయంలో ఆమెపై ఆగ్రహంవ్యాక్తం చేసినట్టు తెలుస్తోంది.   

సినీ నటి.. మాజీ హీరోయిన్ జయప్రద చిక్కుల్లో పడ్డారు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నటైమ్ లో ఆమెపై పెట్టిన కేసుకు సబంధించి ప్రస్తుతం జయప్రదకు చిక్కులు తప్పేట్లు లేవు. జయప్రదకు ఎన్ని సార్లు నోటీస్లు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. 

ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్‌ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్‌ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ రాంపుర్‌ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి జయప్రద   పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. 

దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.
 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్