`వార్‌ 2`లో ఎన్టీఆర్‌ రోల్ ఏంటో తెలిసిపోయింది.. నిజమైతే రణరంగమే?

Published : Feb 13, 2024, 01:46 PM IST
`వార్‌ 2`లో ఎన్టీఆర్‌ రోల్ ఏంటో తెలిసిపోయింది.. నిజమైతే రణరంగమే?

సారాంశం

ఎన్టీఆర్‌ నార్త్ మార్కెట్‌పై కన్నేశాడు. ఇప్పుడు ఆయన `వార్‌ 2`లో నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఆయన పాత్రకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌ చక్కర్లు కొడుతుంది.   

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ వైపు తెలుగు పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తూనే మరోవైపు నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందట. ఇందులో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మిస్తుంది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. షూటింగ్‌ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఎన్టీఆర్‌ హీరో పాత్రనా, లేక విలన్‌ పాత్రనా, లేదంటే హృతిక్‌ రోషన్‌తో కలిసి మరో హీరోగా కనిపిస్తాడా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే గతంలో మాత్రం ఇందులో నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర అనే ప్రచారం జరిగింది. `జై లవ కుశ` తరహాలోని నెగటివ్‌ రోల్‌ అని అన్నారు. 

కానీ తాజాగా దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్‌ రోల్‌ ఏంటో తెలిపోయింది. `వార్‌ 2`లో తారక్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తాడట. ఆయనది పూర్తిగా నెగటివ్‌ రోలే అని తెలుస్తుంది. హృతిక్‌ రోషన్‌తో తలపడే పాత్ర అని అంటున్నారు. ఆయన పాత్ర అతి భయంకరంగా ఉంటుందట. హృతిక్‌, తారక్‌ తలపడితే రణరంగమే అనేలా ఆయన పాత్ర ఉంటుందని, అలాంటి సీన్లని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారని అంటున్నారు. 

మోస్ట్‌ స్టయిలీష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. గత `వార్‌`మూవీకి రెట్టింపు బడ్జెట్‌, భారీ స్కేల్‌లో దీన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ఇండియా మోస్ట్ వాంటెడ్‌ మల్టీస్టారర్‌ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో అలియాభట్‌ పేరు హీరోయిన్‌గా వినిపిస్తుంది. మరోవైపు కియారా అద్వానీ నేమ్‌ కూడా వినిపించింది. మరి వీరిలో ఎవరు ఫైనల్‌ అవుతారు? ఎవరికి ఎవరు జోడీ అవుతారో చూడాలి. 

ఇక ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సమ్మర్‌కి(ఏప్రిల్‌ 5) రావాల్సిన ఈ మూవీని ఇప్పుడు దసరాకి షిఫ్ట్ అవుతుందని తెలుస్తుంది. 

Read more: ప్రభాస్‌ ఉన్నా `కన్నప్ప`ని కాపాడలేడా?.. ఇప్పట్నుంచే భయపెడుతున్నారే.. రజనీ ఎంత పనిచేశావయ్యా?

Also Read: ఎన్టీఆర్‌ నుంచి మరో `నాటు నాటు` రేంజ్‌ సాంగ్‌.. హృతిక్‌తో కలిసి రచ్చకి రెడీ.. `వార్‌ 2` లెక్క వేరే !
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?