ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్ లు ఇవే.. తప్పకుండా చూడాల్సినవి ఇవే..

Published : Jun 23, 2025, 10:45 AM IST
OTT movies

సారాంశం

ఈ వారం ముఖ్యంగా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ZEE5, సన్ NXT వేదికగా కొత్త కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు, సిరీస్ ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈవారం ఓటీటీ రిలీజ్ లు 

ఈ వారం (జూన్ 23 నుంచి 29 వరకు) ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్లలో వివిధ కంటెంట్‌లను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు విడుదల చేస్తున్నాయి. ఈ వారం ముఖ్యంగా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ZEE5, సన్ NXT వేదికగా కొత్త కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు, సిరీస్ ల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

ప్రైమ్ వీడియో 

పంచాయత్ సీజన్ 4 (Panchayat Season 4) 

విడుదల తేదీ: జూన్ 24 

జీతేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 

నెట్ ఫ్లిక్స్ 

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (Squid Game Season 3) 

విడుదల తేదీ: జూన్ 27 

గత సీజన్‌ క్లైమాక్స్ తర్వాత కథను కొనసాగిస్తూ, మిత్రుని మృతి, మోసం, తిరుగుబాట్లు అంశాలతో ఈ సీజన్ ఉండబోతోంది. లీ జంగ్ జే, లీ బ్యూఙ్ హన్, వి హా జూన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రైడ్ 2(Raid 2)

విడుదల తేదీ : జూన్ 27

అజయ్ దేవగన్, రితేష్ దేశ్ ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన రైడ్ 2 చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతోంది. 

జియో హాట్ స్టార్ 

ఐరన్‌హార్ట్ (Ironheart) 

విడుదల తేదీ: జూన్ 25 

బ్లాక్ పాంథర్ తర్వాత రిరీ విలియమ్స్ తిరిగి చికాగోకు వస్తుంది. టెక్నాలజీ వర్సెస్ మేజిక్ నేపథ్యంలో రూపొందించిన ఈ సిరీస్‌లో "ది హుడ్" అనే విలన్‌ను పరిచయం చేస్తారు.

ది బేర్ సీజన్ 4 (The Bear Season 4)

విడుదల తేదీ: జూన్ 26 

కార్మీ అనే యువ చెఫ్ తన టీమ్‌తో కలిసి ఓ శాండ్‌విచ్ షాప్‌ను ప్రొఫెషనల్ రెస్టారెంట్‌గా మార్చే ప్రయత్నాల్లో పడతాడు. ఎమోషన్, డ్రామా, కిచెన్ టెన్షన్‌తో నిండిన కథ.

మిస్ట్రీ (Mistry) 

విడుదల తేదీ: జూన్ 27 

OCDతో బాధపడే మాజీ పోలీస్ అర్మాన్ మిస్ట్రీ ఎలా అత్యంత క్లిష్టమైన కేసులను ఛేదిస్తాడు అనేదే కథ. రామ్ కపూర్, మోనా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ది బ్రూటలిస్ట్ (The Brutalist) 

విడుదల తేదీ: జూన్ 28 యుద్ధానంతర యూరప్ నుంచి అమెరికాకు వలస వచ్చిన హంగేరియన్-జ్యూయిష్ ఆర్కిటెక్ట్ లాస్జ్లో తోత్ జీవిత కథ. అడ్రియన్ బ్రోడి ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం అనేక ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకుంది. 

జీ 5

ఆటా తాంబయ్చా నాయ్ (Ata Thambaycha Naay) 

విడుదల తేదీ: జూన్ 27 

ముంబై మున్సిపాలిటీ పరిశుభ్రతా కార్మికుల నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, వారి విద్యాభివృద్ధికి ప్రయత్నించే ప్రభుత్వ అధికారిని చూపిస్తుంది.

విరాటపాలెం 

విరాటపాలెం అనే తెలుగు సిరీస్ కూడా జీ 5లో జూన్ 27న రిలీజ్ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?