మీ పిల్లలకు ‘కల్కి’సెట్స్ చూపించాలనుకుంటే.. ఇలా చేయండి చాలు

Published : Jul 22, 2024, 09:00 AM IST
  మీ పిల్లలకు ‘కల్కి’సెట్స్  చూపించాలనుకుంటే.. ఇలా చేయండి చాలు

సారాంశం

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’  విడుదలైన రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది.


ప్రముఖ దర్శకుడు నాగ్‌అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి’ జూన్‌ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ప్రేక్షకులకు కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తోంది. చూసినవాళ్లే నాలుగైదు సార్లు చూస్తున్నారు.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ లాంటి ప్రముఖ నటుల కీలక పాత్రలు, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ లాంటి యంగ్‌ హీరోల అతిథి పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి ‘పార్ట్‌ 2’పై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా పిల్లలకు కూడా తెగ నచ్చుతోంది. 

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ నేపధ్యంలో  చిత్రం టీమ్ ...పిల్లలకు ఓ ఆఫర్ ఇచ్చింది.  ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టింది. ‘మీ చిన్నారులుకు కల్కి సెట్స్‌ను చూపించాలనుకుంటున్నారా? మీ చిన్నారి కల్కి గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి మాకు పంపండి. కల్కి సెట్స్‌ను చూసే అవకాశాన్ని పొందండి! మీ వీడియోలకు #ILoveKalki అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేయండి’ అని సూచించింది. మరి, మీ పిల్లలు కల్కి సెట్స్‌ను చూపించాలనుకుంటే ఇలా వెంటనే చేసేయండి.

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’  విడుదలైన రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బుక్‌మైషో’లో అత్యధిక టికెట్లు  బుక్‌ అయిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో, ఇప్పటివరకూ ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ (Jawan) రికార్డును (12.01 మిలియన్‌ టికెట్లు) ‘కల్కి’ అధిగమించినట్టైంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌