ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో ఛాన్స్ .. వన్‌ మినిట్‌ వీడియో

Published : Dec 27, 2020, 03:13 PM IST
ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో ఛాన్స్ .. వన్‌ మినిట్‌ వీడియో

సారాంశం

ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో అవకాశం వచ్చింది. `సలార్‌` చిత్రంలో నూతన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అందుకోసం ఆడిషన్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ ఆడిషన్‌ నిర్వహించగా, ఇప్పుడు చెన్నైలో నిర్వహిస్తున్నారు. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో అవకాశం కల్పించారు `సలార్‌` చిత్ర బృందం. ఇందులో చాలా వరకు కొత్త నటీనటులను తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆడిషన్‌ని నవంబర్‌ నుంచి ప్రారంభించారు. దీనికి ఇప్పటికే వందలాది మంది నటనపై ఆసక్తిగల వారు తమ ప్రతిభని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మరో అవకాశం కల్పిస్తుంది `సలార్‌` చిత్ర బృందం. 

ఇంతకు ముందు డైరెక్ట్ ఆడిషన్‌ చేసిన యూనిట్‌ ఇప్పుడు ఒక నిమిషం నిడివి గల వీడియోలను పంపించాలని తెలిపింది. భాష ఏదైనా నిమిషం వీడియోని ఈ నెల 30 ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పంపించాలని వెల్లడించారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సెలబ్రిటీల రీట్వీట్లతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఏజ్‌ లిమిట్‌ లేదు. చిన్నారుల ఎనిమిది నుంచి 12ఏళ్ల వయసు ఉండాలి. మిగిలిన వారికి ఏజ్‌ లిమిట్‌ లేదు. 

`సలార్‌` చిత్రాన్ని ప్రభాస్‌ హీరోగా రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. హోంబలే ఫిల్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందే ఈ సినిమాని జనవరి 18న ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్