
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వివాదాలకు కేంద్ర బిందువు. ఆయన తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ ఓ వర్గం నుండి తీవ్ర విమర్శలకు గురైంది. ప్రోపగాండా మూవీ అని పలువురు అభిప్రాయ పడ్డారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ది కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించగా జ్యూరీ హెడ్ నవద్ లాపిడ్ అభ్యంతరం తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టే మూవీ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ కమర్షియల్ గా విజయం సాధించినా అబాసుపాలైంది. నటుడు ప్రకాష్ రాజ్, వివేక్ అగ్నిహోత్రి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది.
కాగా వివేక్ అగ్నిహోత్రి పలు సందర్భాల్లో హీరో ప్రభాస్ ని టార్గెట్ చేశారన్న వాదన ఉంది. ఆయన సౌత్ ఇండియా కమర్షియల్ చిత్రాలను ఎద్దేవా చేస్తుంటారు. రాధే శ్యామ్ మూవీని తాను తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో దెబ్బతీశాను. నెక్స్ట్ సలార్ ని 'ది వ్యాక్సిన్ వార్' చిత్రంతో ఓడిస్తానని వివేక్ అగ్నిహోత్రి అన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు.
ట్విట్టర్ వేదికగా... 'నేను అనని మాటలు నాకు ఆపాదించి తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారు? నాకు ప్రభాస్ అంటే గౌరవం. ప్రభాస్ పెద్ద స్టార్, భారీ చిత్రాలు చేస్తారు. మేము తక్కువ బడ్జెట్ తో స్టార్స్ లేకుండా ప్రజల సమస్యలపై సినిమాలు చేస్తాము. మా మధ్య అసలు పోలికే లేదు...' అని కామెంట్ చేశారు. ఆయన ట్వీట్ గమనిస్తే ప్రభాస్ ని ఎగతాళి చేస్తున్నట్లుగా ఉంది. ప్రభాస్ పెద్ద స్టార్ అంటూనే... స్టార్స్ లేకుండా సోషల్ మూవీస్ తీసి హిట్లు కొట్టే మాతో పోలికా, అని సెటైర్ వేశారు.
Who is spreading such fake news attributing fake quotes to me? I respect Prabhas who is a mega mega star doing mega mega budget films.
We make non-starter, small budget, people’s films. There is no comparison between us.
Pl spare me. https://t.co/IoHqdZGXCl
ప్రభాస్ మీద ఆయనకున్న ఈర్ష్య స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ విషయంలో కూడా వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ పై పరోక్షంగా అనుచిత కామెంట్స్ చేశారు. ఎవరిని పడితే వారిని ప్రజలు రామునిగా ఒప్పుకోరు. రాత్రంతా తాగి పొద్దున్నే నేను దేవుడ్ని అంటే సరిపోదు. జనాలు పిచ్చోళ్ళు కాదని ఆయన ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో అన్నారు. వివేక్ అగ్నిహోత్రి అంతలా ప్రభాస్ ని టార్గెట్ చేయడం వెనుక కారణమేంటో..? బహుశా ప్రభాస్ బాలీవుడ్ పై ఆధిపత్యం సాధించడం వివేక్ జీర్ణించుకోలేకపోతున్నారేమో అని పలువురి వాదన...