Shyam Singha Roy : జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగరాయ్’ డిజిటల్ ప్రీమియర్..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 17, 2022, 05:44 PM ISTUpdated : Jan 17, 2022, 05:45 PM IST
Shyam Singha Roy : జనవరి  21న నెట్ ఫ్లిక్స్ లో ‘శ్యామ్ సింగరాయ్’ డిజిటల్ ప్రీమియర్..?

సారాంశం

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ విజయవంతంగా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీ  రిలీజ్ పై తాజాగా  సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది. ఈ జనవరి 21కే  రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నాని ఫ్యాన్స్ ఒక పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.   

హీరో నాని (Nani)శ్యామ్ సింగరాయ్ మూవీతో కమర్షియల్ హిట్ కొట్టారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ విభిన్న కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ థియేటర్స్ లో సందడి చేయగా ఓటీటీ విడుదలపై అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)విడుదలకు ముందు నాని మీడియా ఇంటరాక్షన్ లో ఓ కామెంట్ చేశారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ శ్యామ్ సింగరాయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇవ్వజూపిందట. అయితే ప్రేక్షకులకు థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆఫర్ ని వదులుకొని థియేటర్స్ లో విడుదల చేశామన్నారు. కాగా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ హక్కుల కోసం ప్రయత్నించింది నెట్ ఫ్లిక్స్ అనే ఊహాగానాలే ప్రస్తుతం నిజమయ్యేట్టు ఉన్నాయి.  

శ్యామ్ సింగరాయ్ మూవీ ఈ జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నట్టు ‘నాని ఫ్యాన్స్’ ట్విట్టర్ లో ఒక ప్టోసర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ లో జనవరి 21న నెట్ ఫ్లిక్స్ వేదికన ‘శ్యామ్ సింగరాయ్’ డిజిటల్ ప్రీమియర్  విడుదల కానున్నట్టు పేర్కొన్నారు. థియేటర్ రిలీజ్ అనంతరం కూడా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను నాని ఫ్యాన్స్ ధ్రువీకరిస్తున్నారు. 

 

కానీ శ్యామ్ సింగరాయ్ మూవీ బ్యానర్ ‘నిహారిక  ఎంటర్ టైన్ మెంట్’ నుంచి, నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి  ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అభిమానులు తమ ఓటీటీలో చూడాలనుకే వారు జనవరి 21న తప్పకుండా రిలీజ్ కానున్నట్టు అభిప్రాయపడుతున్నారు.  అభిమానుల కోరిక మేరకు త్వరలో  ఓటీటీ అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని పలువురు భావిస్తున్నారు. 
 
కాగా శ్యామ్ సింగరాయ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేరుగా చూడాలని సాయి పల్లవి (Sai Pallavi)ఆశపడ్డారు. దీని కోసం ఆమె చాలా పెద్ద సాహసం చేశారు. హైదరాబాద్ శ్రీరాములు థియేటర్స్ కి ఆమె మారువేషంలో  బురఖా ధరించి వెళ్లి సినిమా చూసిన విషయం తెలిసిందే.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా