శారీరకంగా యువతిని వాడుకుని మోసం: కంగనా రనౌత్ బాడీ గార్డ్ అరెస్ట్

Published : May 31, 2021, 09:17 AM ISTUpdated : May 31, 2021, 09:24 AM IST
శారీరకంగా యువతిని వాడుకుని మోసం: కంగనా రనౌత్ బాడీ గార్డ్ అరెస్ట్

సారాంశం

ఓ యువతి పిర్యాదు మేరకు  కంగనా రనౌత్ బాడీ గార్డ్ కుమార్ హెగ్డేను అదుపులోకి తీసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని తనతో రిలేషన్షిప్ నడిపి, పారిపోయాడని ఆ యువతి తన కంప్లైన్ట్ లో పేర్కొంది.


స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీ గార్డ్ కుమార్ హెగ్డేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి పిర్యాదు మేరకు కుమార్ హెగ్డేను అదుపులోకి తీసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని తనతో రిలేషన్షిప్ నడిపి, పారిపోయాడని ఆ యువతి తన కంప్లైన్ట్ లో పేర్కొంది. 


కుమార్ హెగ్డే ముంబైకి చెందిన ఓ యువతితో ఎనిమిదేళ్ళుగా సహజీవనం సాగిస్తున్నాడు. ప్రేమగా మొదలైన వీరి బంధం లివింగ్ రిలేషన్ షిప్ కి దారితీసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడట కుమార్ హెగ్డే. చివరికి పెళ్లి చేసుకుందాం అని ఒత్తిడి తేవడంతో సొంత ఊరికి పారిపోయాడని ఆమె ఆరోపిస్తున్నారు. 
కుమార్ స్వగ్రామం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని హెగ్గడేహళ్లి. 

తల్లికి ఆరోగ్యం సరిగా లేదని తన వద్ద రూ. 50వేలు తీసుకొని తన గ్రామానికి వెళ్ళాడు. సొంత ఊరికి వెళ్ళిన నాటి నుండి తనతో కమ్యూనికేషన్ కట్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడని ఆ యువతి తెలియజేశారు. కుమార్ హెగ్డే స్వగ్రామం హెగ్గడేహళ్లి లో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు