Jersey Postponed: హిందీ జెర్సీ కి ఒమిక్రాన్ దెబ్బ...!

Published : Dec 28, 2021, 05:33 PM IST
Jersey Postponed: హిందీ జెర్సీ కి ఒమిక్రాన్ దెబ్బ...!

సారాంశం

శుక్రవారం విడుదల కావాల్సిన జెర్సీ మూవీ వాయిదా వేశారు. డిసెంబర్ 31న జెర్సీ విడుదల కావాల్సి ఉండగా... పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఒమిక్రాన్ (omicron) కేసులు రోజు రోజుకూ పెరుగుతుండగా... దేశంలో భయానక వాతావరణం చోటు చేసుకుంటుంది. గత అనుభవాల రీత్యా ప్రభుత్వాలు, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై చీకటి ఛాయలు అలుముకుంటున్నాయి. కొత్త చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. రెండేళ్లుగా పరిశ్రమ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుంది. లాక్ డౌన్ కారణంగా... షూటింగ్స్ నిలిచిపోయాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదలకు నోచుకోలేకపోతున్నాయి.

థర్డ్ వేవ్ సంభవిస్తే దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ కుదేలవుతోంది. చూస్తుంటే మరలా లాక్ డౌన్ తప్పేలా లేదు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నివారణా చర్యలు చేపట్టాయి. ఢిల్లీలో థియేటర్స్ పూర్తిగా మూసివేశారు. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడుస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన జెర్సీ మూవీ వాయిదా వేశారు. డిసెంబర్ 31న జెర్సీ విడుదల కావాల్సి ఉండగా... పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షాహిద్ కపూర్ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జెర్సీ చిత్రాన్ని తెరకెక్కించారు. 2019 లో నాని హీరోగా విడుదలైన జెర్సీ చిత్రానికి ఇది అధికారిక రీమేక్.

దిల్ రాజు హిందీ జెర్సీ (Jersey) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలంగా జెర్సీ షూటింగ్ జరుపుకుంటుంది. లాక్ డౌన్ తో పాటు షాహిద్ గాయాలపాలు కావడంతో చిత్రీకరణ  ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు న్యూ ఇయర్ సీజన్ ని క్యాష్ చేసుకుందామనుకున్న నిర్మాతలకు నిరాశే ఎదురైంది. జెర్సీ మూవీలో షాహిద్ (shahid Kapoor) ప్రొఫెషనల్ క్రికెటర్ రోల్ చేస్తుండగా... మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుధ్ స్కోర్ అందిస్తుండగా, సాంగ్స్ సాచెట్ పరంపర కంపోజ్ చేశారు. తెలుగులో మంచి విజయం సాధించిన జెర్సీ, జాతీయ అవార్డ్స్ సైతం కొల్లగొట్టింది. 

Also read నీ పేరేంటి?.. వైసీపీ మంత్రిపై నాని సెటైర్.. నాని గారూ అసలు తగ్గడం లేదుగా!

ఇక షాహిద్ ఈ మూవీ కోసం కఠిన శిక్షణ తీసుకున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం శారీరకంగా సిద్ధమయ్యారు. సహజంగానే క్రికెటర్ లవర్ అయిన షాహిద్ మైదానంలో క్రికెటర్స్ బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకోవడానికి అనేక మ్యాచ్ లు చూశారట. ఇక షాహిద్ గత చిత్రం కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్. మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి 2019 హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. కబీర్ సింగ్ తెలుగు అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్. జెర్సీతో మరో తెలుగు హిట్ రీమేక్ తో భారీ విజయం సాధించాలని షాహిద్ కోరుకుంటున్నారు. 

Also read Allu Arjun Emotional: సుకుమార్‌ ఎమోషనల్‌ స్పీచ్‌కి కంటతడి పెట్టుకున్న బన్నీ.. పుస్తకంగా `పుష్ప`

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌