
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడుపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న కాటమరాయుడు మూవికి సంబంధించిన క్లైమాక్స్ సీన్ ఫుటేజ్ లీక్ కావడం టీమ్ ను కలవరపెడుతోంది. ఇటీవల కాలంలో బారీ సినిమా సీన్స్ లీక్ అవడం కామనైపోయింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేేది సినిమాకు సంబంధించి కూడా.. ఇలానే లీకేజీ కలకలం సృష్టించింది.
తాజాగా కాటమరాయుడు సినిమాలో క్లైమాక్స్ కు ముందు జరిగే ఫైట్ సీన్ ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పవన్ అభిమానులు కూడా ఈ సీన్ ను మళ్లీ వెరైటీగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ లీకేజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మిత్రుడు నిర్మాత శరత్ మరార్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కాటమరాయుడు ఇక రేపట్నుంచీ పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఉగాదికి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.