ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న అవతార్ ‌-2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published : Mar 09, 2023, 08:53 AM IST
ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న అవతార్ ‌-2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సారాంశం

హాలీవుడ్  మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్..  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన అవతార్ మూవీకి సీక్వెల్ మూవీ అవతార్2.. డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కబోతుంది.   


వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్స్ మీద కోట్లాది ప్రేక్షకులను అలరించిన సినిమా అవతార్2. జేమ్స్ కామరాన్ మస్తిష్కం నుంచి పుట్టిన అద్భుత సృష్టి ఈ సినిమా.  లాస్ట్ ఇయర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి.. అవతార్2 సృష్టించిన రికార్డుల ప్రభంజనం అంతా ఇంతా కాదు. వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర అవతార్ 2  కనివినీ ఎరుగని వసూళ్లు సాధించింది. యావత్ సినీ ప్రపంచాన్ని అలరించింది. ఇక ఇండియా లో.. ముఖ్యంగా తెలుగులో కూడ ప్రభంజనం సృష్టించింది అవతార్ 2  తెలుగులోనూ దాదాపుగా 60 కోట్లకు పైగా కలెక్షన్స్ ను  కలెక్షన్స్ సాధించింది. అంతే కాదు టాలీవుడ్ లో.. భారీగా కలెక్షన్లు సాధించిన మొదటి డబ్బింగ్ సినిమాగా అవతార్ 2 ఎవరూ చెరిపివేయలేని రికార్డ్ ను క్రియేట్ చేసింది. 

ఇక వెండితెరైప మెరుపులు మెరిపించిన ఈసినిమా.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి సిద్థం అవుతోంది.  అవతార్2 ఓటీటీలో ఎప్పుడు  రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది అవతార్ టీమ్. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అది కూడా అతి త్వరలోనే.. ఈ నెలలోనే ఈ అవతార్3 డిజిట్ ప్లాట్ పామ్ ఎక్కబోతుంది. మార్చి 28న ఈసినిమా ఓటీటీ ఆడియన్స్ ను అలరించనుంది. ఈవిషయాన్ని అవతార్2 టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 

 

 ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన  అమెజాన్  ప్రైమ్, యాపిల్ టీవీల్లో అవతార్ 2 స్ట్రీమింగ్ కానుంది. 4కే అల్ట్రా హెచ్​డీ, డాల్బీ అట్మాస్ ఆడియోతో మూవీ అందుబాటులోకి రానుంది. అయితే కొన్ని రోజులు పే అండ్ వాచ్  ప్రాతిపదికన అవతార్ స్ట్రీమింగ్ కానుంది. ఆతరువాత ఆడియన్స్ కు ఫ్రీగా అందుబాటులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అవతార్ 2 తరువాత అవతార్ 3 పనిలో బిజీగా ఉన్నాడు జేమ్స్  కామరాన్. ఇలా మరో రెండు సీక్వెల్స్ ను ఆయన ప్రకటించాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా